వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాపిల్‌కు రూ. 65వేల కోట్లు చెల్లిస్తున్న గూగుల్: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌కు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ భారీ మొత్తాన్ని చెల్లించనుంది. ఐఫోన్‌లోని సఫారీ వెబ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉంచేందుకు యాపిల్‌కు గూగుల్‌ 9బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.65వేల కోట్లు) చెల్లించనుందని తెలిసింది.

2013, 2014 సంవత్సరాల్లో ఇందుకు గాను గూగుల్‌ బిలియన్‌ డాలర్లు చెల్లించగా.. 2017లో 3బిలియన్‌ డాలర్లు చెల్లించింది. ఈ ఏడాది రెట్టింపు కన్నా ఎక్కువ మొత్తం 9బిలియన్‌ డాలర్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు తెలిపారని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదికలో వెల్లడించింది.

 Google likely to pay $9 billion to remain Apples default search

డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కోసం 2019లో గూగుల్‌ యాపిల్‌కు 12బిలియన్‌ డాలర్లు (రూ.87వేల కోట్లు) చెల్లించే అవకాశముందని తెలిపింది. యాపిల్‌ నుంచి ఎక్కువ మంది వినియోగదారులు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారని నివేదికలో పేర్కొంది.

గూగుల్‌కు వినియోగదారుల ట్రాఫిక్‌ వచ్చే ముఖ్యమైన ఆధారాల్లో యాపిల్‌ ప్రధానమైనదని గూగుల్‌ విశ్వసిస్తుందని వివరించింది. యాపిల్‌ ఐఫోన్లు, ఐపాడ్స్‌ సహా ఐఓఎస్‌ పరికరాల్లో సఫారీలో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉపయోగిస్తోంది.

English summary
Search engine giant Google is reportedly paying Apple a whopping $9 billion in 2018 to remain the default search engine for iPhone's Safari browser on iOS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X