వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూజర్లకు 'అల్బాబెట్' షాక్, గూగుల్ ప్లస్ మూసివేత: కారణాలు ఇవే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వాడకం తక్కువగా ఉండటం, భద్రతాపరమైన లోపాల కారణంగా గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు గూగుల్ సోమవారం నాడు వెల్లడించింది. భద్రత, సాఫ్టువేర్ లోపాలతో దాదాపు 5 లక్షల మంది గూగుల్ ప్లస్ సోషల్ మీడియా ఖాతాదారుల వ్యక్తిగత విషయాలు ఇతరుల పరమయ్యాయి.

ఐదు లక్షల అకౌంట్ల వ్యక్తిగత విషయాలు ఇతరులకు చేరాయి

ఐదు లక్షల అకౌంట్ల వ్యక్తిగత విషయాలు ఇతరులకు చేరాయి

ఈ విషయం వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చింది. ఐదు లక్షల ఖాతాదారుల వ్యక్తిగత విషయాలు ఇతరుల వశమయ్యాయని గూగుల్ అంగీకరించింది. ఇలా పలు కారణాల వల్ల గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ ప్రకటించింది. గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ట్రంప్ విమానం ఎక్కుతుంటే ఏం జరిగిందో చూడండి, జోకులు పేలుతున్నాయి (వీడియో)ట్రంప్ విమానం ఎక్కుతుంటే ఏం జరిగిందో చూడండి, జోకులు పేలుతున్నాయి (వీడియో)

టెక్నికల్ బగ్

టెక్నికల్ బగ్

ప్రాజెక్టు స్ట్రోబ్ కింద గూగుల్ చేపట్టిన సెర్చ్‌లో టెక్నికల్ బగ్‌ను గుర్తించారు. గూగుల్ ప్లస్‌లో బగ్ వచ్చినట్లు సంస్థ ఆరునెలల క్రితం గుర్తించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమీక్ష జరిపారు. మార్చి నెలలోనే ఆ సాఫ్టువేర్ బగ్‌కు విరుగుడు కనుగున్నారు.

 డేటా మాత్రం హానీకి గురి కాలేదు

డేటా మాత్రం హానీకి గురి కాలేదు


కానీ అంతలోపే లోపు 5 లక్షల అకౌంట్ల సమాచారం బయటకు వెళ్లిపోయింది. అయితే ఆ డేటా మాత్రం ఎటువంటి హానికి గురికాలేదని గూగుల్ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఐదు లక్షల మంది యూజర్ల డేటా చోరీ అయినట్లు గుర్తంచారు.

పడిపోయిన షేర్లు

గత మార్చిలోనే గూగుల్ బగ్‌ను గుర్తించింది. కానీ యూజర్లకు సెక్యూరిటీ అంశాల గురించి చెప్పలేదు. కాగా, గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో మాతృ సంస్థ అల్పాబెట్ షేర్లు పడిపోయాయి. షేర్లు 1.5 శాతం పడిపోయాయి.

English summary
Google will shut down the consumer version of its social network Google+ after announcing data from up to 500,000 users may have been exposed to external developers by a bug that was present for more than two years in its systems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X