వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్‌కు రూ.22వేల కోట్ల జరిమానా తప్పేట్టు‌లేదు!

|
Google Oneindia TeluguNews

లండన్: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా తప్పేలా కనిపించడం లేదు. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ సంస్థకు కోర్టు త్వరలోనే వేల కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయి.

సెర్చ్ ఇంజన్లో తనకు నచ్చిన కంపెనీలకే ముందు స్థానం ఇస్తూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ దాఖలైన కేసులో గూగుల్‌కు భారీ ఎదురు దెబ్బ తగలనుంది.

2010లో వేసిన ఓ కేసులో గూగుల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది. సుమారు రూ. 23 వేల కోట్ల (మూడు బిలియన్ యూరోల) భారీ జరిమానా పడనుందని స్పష్టం చేసింది.

Google reportedly faces a record antitrust fine in Europe

గత ఆరేళ్లుగా గూగుల్ యూరోపియన్ యూనియన్(ఈయూ) తో పోటీ పడి పలుదఫాలు విఫలం చెందిందనీ, ఇక ఈయూ పక్కకు తప్పుకుంటే తప్ప గూగుల్ జరిమానా నుంచి తప్పించుకోలేదని రాయిటర్స్ తేల్చి చెప్పింది.

కాగా, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జరిమానా నిర్ణయం జూన్ మొదటి వారంలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. తనకు నచ్చిన కంపనీ సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే హక్కును కూడా గూగుల్ కోల్పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

English summary
It's growing increasingly likely that Google will face European Union fines for allegedly abusing its dominance of internet search, but just how big will the penalty be? Huge, if you ask the Telegraph's sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X