వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్చేశారు: గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో బాలుడు(వీడియో)

|
Google Oneindia TeluguNews

సిన్సినాటీ: అమెరికా సిన్సినాటి జూలో గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో పొరపాటున పడిపోయిన నాలుగేళ్ల బాలుడిని రక్షించేందుకు పోలీసులు 17 సంవత్సరాల వయసున్న గొరిల్లాను కాల్చి చంపారు. 12 అడుగుల లోతున్న ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాబును గొరిల్లా తొలుత ఏమీ చేయలేదు.

కాసేపు నీటిలో పిల్లాడిని అటుఇటు తిప్పింది. తన కాళ్ళ మధ్యలో పెట్టుకుంది. చేతుల్తో ఎత్తుకుంది. అయితే ఆ గొరిల్లా బాలుడ్ని చంపేస్తుందనే భయంతో అధికారులు దాన్ని కాల్చి చంపేశారు. ఆ తర్వాత బాలుడ్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

Gorilla killed after 4-year-old falls into zoo enclosure

ఆ గొరిల్లా పేరు హరాంబే అని అధికారులు తెలిపారు. కాగా, ఆ గొరిల్లాను చంపడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఓ తల్లి నిర్లక్ష్యం వల్ల మూగ జీవి ప్రాణాన్ని అనవసరంగా బలి తీసుకున్నారని విమర్శకులు ఆన్‌లైన్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ మూర్ఖత్వం వల్ల అందమైన జీవాలు అనవసరంగా ప్రాణాలు విడుస్తున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు.

పిల్లవాడి పేరెంట్స్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కొందరు విమర్శకులు ఆన్‌లైన్‌లో పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్‌పై 24 గంటల్లోనే సుమారు 10 వేల మంది సంతకం కూడా చేశారు. గొరిల్లాను చంపేందుకు జూ అధికారులు అత్యుత్సహాం ప్రదర్శించారని, వాళ్లను కూడా చట్టపరంగా శిక్షించాలని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అయితే బాలుడిని కాపాడటం కోసం మరో గత్యంతరం లేకపోయిందని జూ డైరక్టర్ తెలిపారు.

English summary
A holiday weekend outing at Cincinnati's zoo turned doubly tragic Saturday when a 4-year-old boy was hospitalized after falling into a gorilla enclosure - and zoo workers had to kill the rare gorilla to protect the boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X