వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధ వాతావరణం: కేంద్రం అప్రమత్తం: ట్రావెల్ అడ్వైజరీ..అటు పక్కకెళ్లొద్దు.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న యుద్ధం తరహా వాతావరణం, తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నివసిస్తోన్న భారతీయులు, భారత మూలాలు గల కుటుంబాల గురించి ఆరా తీస్తోంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తప్ప ఇంటిని దాటి బయటికి వెళ్లొద్దని వారిని సూచించింది. అదే సమయంలో ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

యుద్ధం ఆరంభమైందా?: ఇరాక్ అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్.. !యుద్ధం ఆరంభమైందా?: ఇరాక్ అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్.. !

ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావారాలు, ఎయిర్‌ బేస్‌పై ఇరాన్ వరుసగా క్షిపణులతో దాడి చేసిన తరువాత మధ్య తూర్పు దేశాల్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని మరణించినప్పటి నుంచీ నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన అక్కడి వాతావరణం.. ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించిన తరువాత భగ్గుమంది. ఏకంగా అమెరికా సైనిక స్థావరాలపై దాడి దిగేలా చేసింది.

Amid tensions between US and Iran, the Ministry of External Affairs has advised Indian nationals to avoid all non-essential travel to Iraq until further notification. Indian nationals residing in Iraq are advised to be alert and may avoid travel within Iraq, the MEA said.

ఇరాక్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇరాక్‌లో నివసించే భారతీయులు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. దీనితో పాటు- ఇరాక్‌కు వెళ్లే భారతీయులను కూడా అప్రమత్తం చేసింది. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ వెల్లడించారు. విధి నిర్వహణలో గానీ లేదా ఉపాధి కోసం గానీ ఇరాక్‌కు వెళ్లే భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప ఇరాక్‌కు వెళ్లొద్దంటూ సూచనలను జారీ చేసింది.

English summary
Amid tensions between US and Iran, the Ministry of External Affairs has advised Indian nationals "to avoid all non-essential travel to Iraq until further notification." "Indian nationals residing in Iraq are advised to be alert and may avoid travel within Iraq," the MEA said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X