వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ 'కీలక' నిర్ణయం, అప్పుడే అక్కడ చైనా ఆట సాగుతుంది!

భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ - టిబెటన్‌ సరిహద్దు దళం (ఐటీబీపీ) ఏడీజీ పదవిని భారత్‌ పునరుద్ధరించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బీజింగ్: భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ - టిబెటన్‌ సరిహద్దు దళం (ఐటీబీపీ) ఏడీజీ పదవిని భారత్‌ పునరుద్ధరించింది.

భారత్-చైనా ఆర్మీ మధ్య దూరం 500 మీటర్లే!: అదే డ్రాగన్ వశమైతే..భారత్-చైనా ఆర్మీ మధ్య దూరం 500 మీటర్లే!: అదే డ్రాగన్ వశమైతే..

ఈ నిర్ణ‌యంపై సంబంధిత అధికారులు మాట్లాడారు. ఈ పదవిని 2014 ఫిబ్రవరిలో హోంశాఖ ఎన్‌డీఆర్‌ఎఫ్‌‌కు అప్పగించిందని చెప్పారు.

నిజమా అని వారి ఆశ్చర్యం: భారత్‌కు చైనా మళ్లీ హెచ్చరికనిజమా అని వారి ఆశ్చర్యం: భారత్‌కు చైనా మళ్లీ హెచ్చరిక

ప్రస్తుతం నెల‌కొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ పదవిని హోంశాఖ తిరిగి ఐటీబీపీకి అప్పగించిందన్నారు. 1986 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌కె మిశ్రాను ఐటీబీపీ అదనపు డీజీగా నియమించిన‌ట్లు పేర్కొన్నారు.

ముఖాముఖి

ముఖాముఖి

డొక్లాంలో సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తున ఇటు భారత్, అటు చైనా దళాలు 350 మందితో రెండు వరుసల మానవహారాలు నిర్వహిస్తున్నాయి. ఇరువర్గాలు తమ చేతుల్లో తుపాకులు పట్టుకొని ఉన్నారు. డొక్లాం వద్ద ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Recommended Video

China afraid of Agni-V, India responds it's not aimed at any nation | Oneindia news
ప్రతి రెండు గంటలకు ఓ బ్యాచ్

ప్రతి రెండు గంటలకు ఓ బ్యాచ్

దాదాపు 500 మీటర్ల దూరంలోనే భారత్‌, చైనా సైనికులు నువ్వా నేనా అన్నట్లు నిలబడి ఉంటున్నారు. ప్రతిక్షణం ఇదే పరిస్థితి. క్లిష్టమైన వాతావరణం కారణంగా ప్రతి రెండు గంటలకూ ఒక మానవ హారం బ్యాచ్‌ మారుతూ ఉంటుంది.

సిద్ధమన్నట్లుగా..

సిద్ధమన్నట్లుగా..

సమాచారం మేరకు, చైనా వైపు మానవ రహిత విమానాలు (యూఏవీ) లేదా డ్రోన్లు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. డొక్లాం వద్ద మానవ హారం ఉంది. దాని వెనుక కిలోమీటరు దూరంలో దాదాపు 3000 మంది సైనికులు ఉన్నారు. వారితోపాటే కొన్ని ఆయుధ సామగ్రి కూడా. భారత్ వైపు కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. యుద్ధం వచ్చినా సై అన్నట్లుగా ఉంది.

సరిహద్దుల్లో అందుబాటులోకి 73 రోడ్లు.. చర్చించుకుంటే..

సరిహద్దుల్లో అందుబాటులోకి 73 రోడ్లు.. చర్చించుకుంటే..

ఇదిలా ఉండగా, రాకపోకలకు వీలుగా భారత్‌-చైనా సరిహద్దుల్లో 73 రోడ్లను నిర్మించనున్నట్లు లోకసభకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపా రు. ఇప్పటికే 30 రోడ్లు పూర్తయ్యాయన్నారు. మరోవైపు, పరిగణనలోకి తీసుకోవాల్సిన శక్తిగా భారత్‌ను చైనా గుర్తించాల్సి ఉందని అమెరికా దౌత్తవేత్త నిషా దేశాయ్‌ బిశ్వాల్‌ వ్యాఖ్యానించారు. బీజింగ్‌ వైఖరితో ప్రాంతీయ దేశాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. డొక్లాం విషయంలో భారత్ - చైనా చర్చించుకుంటే మంచిదని అమెరికా అభిప్రాయపడింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అమెరికా ప్రతినిధి హీతర్ నారెట్ అభిప్రాయపడ్డారు.

ఇదే చైనా లక్ష్యం...

ఇదే చైనా లక్ష్యం...

సరిహద్దుల్లో మోహరించిన చైనా లక్ష్యం ఒక్కటే. డొక్లాంకు దక్షిణ దిశగా ఉన్న జంఫారీ రిడ్జ్‌ను స్వాధీనం చేసుకోవడమంటున్నారు. ఏడు ఈశాన్య రాష్ట్రాలను భారత్‌తో కలిపే ప్రదేశమే ఇక్కడి చికెన్స్‌ నెక్‌. ఇది అత్యంత సన్నగా, దాదాపు 23 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. దీనిని స్వాధీనం చేసుకుంటే భారత్‌కు, ఈశాన్య రాష్ట్రాలకూ సంబంధాలు తెగిపోతాయి. అప్పుడు అక్కడ చైనాది ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంటుందు. జంఫారీ రిడ్జ్‌ మీద పట్టు సాధిస్తే చైనాకు చికెన్స్‌ నెక్‌ గుప్పిట చిక్కినట్లేనని, అందుకే, నాథులా పాస్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని ఇక్కడ చైనా పాగా వేసింది. దానిని అడ్డుకోవడానికి భారత సైన్యాలు కంటి మీద కునుకు లేకుండా పహరా కాస్తున్నాయి.

ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని..

ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని..

రాజకీయ లక్ష్యాలను సాధించడం కోసమంటూ సిక్కిం సెక్టార్లోని డోకాలాలోకి చొరబడవద్దని భారత్‌ను చైనా మరోసారి హెచ్చరించింది. పరిస్థితి తీవ్రత క్రమంగా పెరగకుండా ఉండాలంటే ఆ ప్రాంతం నుంచి వెంటనే భారత్‌ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. భారత్‌తో ప్రతిష్టంభనపై బీజింగ్‌లోని విదేశీ రాయబారులతో ఎప్పటికప్పుడు సంభాషణలు జరుపుతున్నట్లు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, డోకాలాలో చైనా బలగాలు ఎంతో సహనంతో ఎదురు చూస్తున్నాయని, అయితే, అవి నిరవధికంగా అక్కడే ఉండలేవని విదేశీ రాయబారులకు చైనా తేల్చి చెప్పింది. చైనా వైఖరి విదేశీ రాయబారులకు ఆందోళన కలిగిస్తోందని, భారత్‌, భూటాన్‌ రాయబారులు ఇదే విషయాన్ని తమ తమ దేశాలకు చేరవేశారని అక్కడి మీడియా తెలిపింది.

English summary
The government has restored a crucial senior-level post in the Sino-India border guarding force Indo-Tibetan Border Police (ITBP) after three years, a development seen as strengthening the paramilitary in the wake of frequent military stand-offs between the two sides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X