వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్, థ్యాంక్స్: గూగుల్ సెర్చ్‌లోను బామ్మ మర్యాద

|
Google Oneindia TeluguNews

లండన్: సాధారణంగా మనం ఎవరినైనా ఏమైనా అడగాలనుకుంటే మర్యాదగా అడుగుతాం. ఏదైనా అనుమానం వచ్చినా లేదా ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్తే దారి గురించి అడగాలన్నా.. పక్కనున్న వారిని మర్యాద ఇచ్చి మరీ అడుగుతాం.

అదే సెర్చింజన్ గూగుల్‌లో అయితే ఆ పదం కొడతాం అంతే! కానీ ఓ బామ్మ మాత్రం గూగుల్ సెర్చింజన్‌లో కూడా మర్యాద చూపించింది. అలవాటులో భాగంగానో, మరేమిటో కానీ తనకు వచ్చిన అనుమానాన్ని గూగుల్‌లో కొట్టింది. అయితే, ఆ పదానికి ముందు, వెనుక మర్యాద చూపించింది.

Grandson shares nan's polite Google search

బ్రిటన్‌కు చెందిన బెన్ జాన్ అనే యువకుడు ఓ రోజు తన బామ్మ ల్యాప్‌టాప్ వాడుతున్నాడు. ఆ సమయంలో గూగుల్‌లోకి వెతకుతుండగా.. తన బామ్మ వెతికిన సందేహం కనిపించింది.

Grandson shares nan's polite Google search

ఓ రోమన్ సంఖ్య విలువ తెలుసుకునేందుకు ఆమె గూగుల్ సెర్చ్ చేశారు. అయితే, సెర్చ్ బార్‌లో తన ప్రశ్నకు ముందు మర్యాదగా.. ప్లీజ్ అని, ప్రశ్న తర్వాత థ్యాంక్యూ అనే పదం జత చేశారు.

దీనిని చూసిన బెన్ జాన్ దానిని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ అయింది. ఈ ట్వీట్‌ను వేలాది మంది లైక్ చేశారు. మరెందరో రీట్వీట్ చేసారు. ఈ విషయం గూగుల్ వరకు వెళ్లగా స్పందించింది. ఆమె సందేహాన్ని తీర్చడంతో పాటు, మీ సందేహం మా ముఖాల మీద చిరునవ్వులు పూయించిందని గూగుల్ ట్వీట్ చేసింది.

English summary
Using Google to search for things on the internet has become a common part of most people's daily lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X