వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్ లవర్: ప్రియురాలి అస్థికలనే పెళ్లాడాడు!

|
Google Oneindia TeluguNews

తైవాన్: అతనో గొప్ప ప్రేమికుడు. ఎందుకంటే ఏ ప్రేమికుడు చేయని సాహసం అతడు చేశాడు. ప్రాణంలా చూసుకునే తన ప్రియురాలు చనిపోవడంతో ఎంతో కుమిలిపోయాడు. తను ప్రేమించిన ప్రియురాలిని దక్కుంచుకోలేకపోయాననే బాధలో మునిగిపోయిన అతను.. ఆమె అస్థికలను వివాహం చేసుకుని తన ప్రేమకు అంతులేదని చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. తైవాన్‌కి చెందిన లాయ్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి కొద్ది రోజులక్రితం చనిపోయింది. దీంతో లాయ్‌ చాలా వేదనకు గురయ్యాడు.

Grieving Taiwanese man marries late girlfriend's ASHES in emotional

ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకుని తన ప్రేమను చాటుకోవాలనుకున్నాడు. వెంటనే సించు అనే గ్రామంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేసి, అందరినీ ఆహ్వానించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోయినప్పుడు తనని ఎలా పెళ్లి చేసుకుంటాడా? అని అందరూ ఆతృతగా చూశారు.

కాగా, లాయ్‌ తన ప్రియురాలి అస్థికలను పెళ్లికూతురి గౌనుతో రెడీ చేసి ఆ అస్థికలతో వివాహం చేసుకున్నాడు. దీంతో అక్కడున్నవారందరూ కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ అతడి ప్రేమకు జోహర్లు చెప్పారు.

English summary
A man from Taiwan was so distraught over the death of his late girlfriend that he recently married her ashes after she had been cremated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X