వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 31 ఉపగ్రహం.. కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగు

|
Google Oneindia TeluguNews

Recommended Video

India Successfully Launched GSAT-31 Satellite | Oneindia Telugu

కౌరో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వరుస ప్రయోగాల సక్సెస్ తో దూసుకెళుతున్న ఇస్రో.. తాజాగా భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఏరియన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియానా రాకెట్ ద్వారా జీశాట్ - 31 ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపించారు. భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల 31 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహం. జీశాట్ -31 ఉపగ్రహంతో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహాన్ని కూడా మోసుకెళ్లింది ఏరియన్ 5 రాకెట్. కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగ్గా అందించనున్న జీశాట్ - 31.. నలభై రెండు నిమిషాల వ్యవధిలోనే నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

GSAT-31 satellite was successfully launched

2,535 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్లపాటు నిరంతరాయంగా కమ్యూనికేషన్ సేవలు అందించనుంది. ఇన్‌శాట్‌, జీశాట్‌ ఉపగ్రహాలకు ఇది కొత్త రూపంగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. డీటీహెచ్‌ టీవి, డిజిటల్ శాటిలైట్, టీవి అప్‌లింక్స్‌ తదితర వాటికి అనుగుణమైన టెక్నాలజీ దీని సొంతం.

English summary
India's latest communication satellite GSAT-31 was successfully launched by European launch services provider- Arianespace rocket from French Guiana in the early hours of Wednesday. The Ariane-5 vehicle injected GSAT-31 into the orbit in a flawless flight lasting about 42 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X