వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఘోరం: 22మంది అమ్మాయిల సజీవ దహనం

అమెరికాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. గ్వాటెమాలా నగరంలోని సాన్‌జోస్‌ పిన్యులా ఆశ్రమంలో బుధవారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 22 మంది పిల్లలు సజీవదహనమయ్యారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. గ్వాటెమాలా నగరంలోని సాన్‌జోస్‌ పిన్యులా ఆశ్రమంలో బుధవారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 22 మంది పిల్లలు సజీవదహనమయ్యారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుం వీరంతా సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా 18ఏళ్లలోపు వారనేనని చెప్పారు. కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆశ్రమంలో అనాథలు, వేరే ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చిన పిల్లలు నివసిస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే పరుపులకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.

Guatemala riot: at least 22 girls dead as home for abused teens catches fire

500 మందికి నివసించగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆశ్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో 800 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆశ్రమంలో ఉంటున్న పిల్లల్లో కొందరు తమకంటే చిన్నవారితో తరచూ గొడవ పడుతూ వారిపై ఘర్షణకు దిగుతుంటారని.. ఆ బాధ భరించలేక చాలా మంది చిన్నారులు ఆశ్రమం వదిలి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.

మంగళవారం రాత్రి నుంచే ఆశ్రమంలో అల్లర్లు తీవ్రమైనట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇది చాలా విషాదకరమైన ఘటన అని గ్వాటెమాలా జాతీయ పోలీస్ అధికారి నేరీ రోమస్ తెలిపారు.

English summary
At least 22 girls have been killed in a fire at a government-run home for abused teens, which broke out when residents set mattresses ablaze after an overnight riot and attempt to escape from the overcrowded government-run center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X