వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ కు మిత్రపక్షం ఝలక్, 182 చోట్ల పోటీ, యువరాజుకు షాక్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Congress President Poll : Congress Announces Schedule | Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి తన మిత్రపక్షం ఝలక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌తో కలిసి మిత్రపక్షంగా గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బరిలో దిగుతుందని భావించిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఇప్పుడు ఒంటరిగా పోటీ చెయ్యాడానికి సిద్ధమయ్యింది. ఈ మేరకు సోమవారం ఎన్సీపీ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేయాలని మొదట భావించామని, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఎన్సీపీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ తమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చెయ్యడంతో తాము 182 స్థానాల్లో సొంతంగా పోటీ చేయ్యాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ తెలిపింది.

గుజరాత్ శాసన సభలో ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయ్యాలని సంవత్సరం క్రితమే సిద్ధమయ్యామని, ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయ్యాలని నిర్ణయించామని ఎన్సీపీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు. ఒంటరి పోరుతో అత్యధిక స్థానాలను గెలుచుకోగలమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయని ప్రఫుల్ పటేల్ వివరించారు.

Gujarat elections 2017: NCP to contest all seats, talks with Congress fail

ఇప్పటికే పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ 77 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. హార్దిక్ పటేల్ తో చర్చలు జరుపుతున్న సమయంలోనే మిత్రపక్షం ఎన్సీపీ షాక్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.

గుజరాత్ లో డిసెంబర్ 9, 14వ తేదీల్లో రెండు విడతలుగా శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ జరిగే ఎన్నికలకు నామినేషన్లు వెయ్యడానికి నంవబర్ 21వ తేదీ మంగళవారం చివరి రోజు కావడంతో ఎన్సీపీ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

English summary
The Nationalist Congress Party (NCP) today said it will contest all 182 seats in the Gujarat Assembly elections, after talks for alliance between the Sharad Pawar-led party and the Congress failed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X