వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్‌లో మిలటరీ అకాడమీపై ఉగ్రవాదుల దాడి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాబూల్:ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి ఉగ్రవాదులు దాడి చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్‌లోని మిలటరీ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో అకాడమీ దద్దరిల్లి పోయింది.

సోమవారం ఉదయం ఐదు గంటలకు ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు. మార్షల్‌ ఫాహిమ్‌ నేషనల్‌ ఢిపెన్స్‌ యూనివర్సిటీ అకాడమీపై ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Gunfire, Blasts Reported Near Kabul Military Academy

పది రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కాబూల్‌ నగరంపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌పై జరిపిన దాడిలో 22 మంది ప్రాణాలు బలితీసుకున్న తాలిబన్లు.. రెండు రోజుల క్రితం అంబులెన్స్‌తో భారీ ఎత్తున్న బాంబు దాడి నిర్వహించి 100 మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు.

అఫ్ఘన్‌ మిలిటరీ అకాడమీలే లక్ష్యంగా ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు దాడులకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్షల్‌ ఫాహిమ్‌ వద్దే బాంబు దాడి చోటు చేసుకోగా.. 11 మంది సైనికులను మృతి చెందారు.

English summary
Afghan security sources say gunmen have attacked the Marshal Fahim Military Academy in Kabul, the latest in a string of violence to hit the Afghan capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X