వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్మస్ మ్యూజికల్ కన్సర్ట్‌పై పేలిన గన్: భయాందోళనల్లో: పోలీసుల కాల్పుల్లో మృతి:

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కలకలం చేలరేగింది. ఆర్థిక రాజధాని న్యూయార్క్.. తుపాకుల కాల్పుల మోతతో మారుమోగిపోయింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని సిటీ క్యాథడ్రల్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ మ్యూజికల్ కన్సర్ట్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తుపాకితో వీరంగం సృష్టించాడు. యథేచ్ఛగా గాలిలో కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. క్రిస్మస్ వేడుకలు కొనసాగుతోన్న పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని హర్లెమ్ ప్రాంతంలోని ఆమ్‌స్టర్‌డామ్ అవెన్యూ, వెస్ట్ 112 స్ట్రీట్‌లో గల సెయింట్ జాన్స్ సిటీ క్యాథడ్రల్ చర్చి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చి బయట మ్యూజికల్ కన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం ఆరంభమైన ఈ కన్సర్ట్.. సాయంత్రం వరకూ కొనసాగాల్సి ఉంది. సుమారు 200 మందికి పైగా ఈ వేడుకలకు హాజరయ్యారు.

Gunman dead after shooting at New York City Cathedral Church of St. John Christmas concert

భుజానికి బ్యాక్‌ప్యాక్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మధ్యాహ్నం చర్చి వద్దకు చేరుకున్నాడు. కొద్దిసేపటి తరువాత.. వెంట తెచ్చుకున్న తుపాకీతో గాలిలో కాల్పులు జరిపాడు. ఈ కన్సర్ట్‌కు హాజరైన వారిపైనా తుపాకీని ఎక్కు పెట్టాడు. వారిని భయపెడుతూ పలుమార్లు గాలిలో కాల్పలు జరిపాడు. సమాచారం అందుకున్న వెంటనే న్యూయార్క్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతన్ని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అతను దీనికి నిరాకరించాడు. పోలీసులపైనా కాల్పులు జరిపాడు. దీనితో వారు జరిపిన ఎదురు కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

అతణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు న్యూయార్క్ సిటీ పోలీస్ కమిషనర్ డెర్మాట్ షెయా తెలిపారు. సుమారు 15 నిమిషాల పాటు అతను చర్చి ఆవరణలో కలియతిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో తేలింది. ఆ ఆగంతకుడు ధరించిన కోవిడ్ మాస్క్.. డొమినిక్ రిపబ్లిక్ జాతీయ పతాకంతో కూడుకుని ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని పేరు, ఇతర వివరాలేవీ ఇంకా తెలియరాలేదని అన్నారు.

Recommended Video

Quad Meet : China టార్గెట్ గా సమిష్టి నిర్ణయాలతో ముందుకుసాగానున్న 4 దేశాలు! || Oneindia Telugu

English summary
Police fatally shot a gunman at the Cathedral of St. John the Divine in New York City following a Christmas concert Sunday afternoon. A choir was lingering at the top of the steps at the cathedral when the suspect entered the scene with two handguns and opened fire into the air.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X