వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్టు చర్చిలో ఉగ్రదాడి: 10 మంది మృతి.. ఐఎస్ పనేనా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని హెల్వాన్ ప్రాంతంలో ఉన్న ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది సహా 9 మంది మృతి చెందారు. కొంతమంది ఉగ్రవాదులు చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, చర్చిని చుట్టుముట్టి ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోగా మరో ఉగ్రవాది పారిపోయినట్లు తెలుస్తోంది.

Gunman launches deadly attack on Coptic church near Cairo

గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి శరీరానికి ఆయుధాలు ధరించి కనిపించినట్లు స్థానికులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు.

గతంలో ఈజిప్టులోని కొన్ని చర్చిలపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబుదాడులకు పాల్పడ్డారు. దీంతో ఈ దాడి కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే చేసి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.

English summary
A gunman opened fire outside a Coptic church south of Cairo, killing at least nine people and wounding at keast five others before being shot dead by police. The incident took place at the Mar Mina church in the Helwan district on the capital’s southern outskirts, according to Egypt’s health ministry. The state-run MENA news agency cited an unnamed official at the interior ministry as saying a second assailant had fled the scene. At least one police officer was among those killed in the attack, local media reported. Mobile phone footage posted on social media appeared to show a man wearing a bulky ammunition vest sprawled on a street as people restrained and then handcuffed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X