వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఎయిర్‌బేస్‌పై ఉగ్ర దాడి: 30కి చేరిన మృతులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లాహోర్: పెషావర్‌లోని పాకిస్ధాన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను లక్ష్యంగా చేసుకొని పది మంది ఉగ్రవాదులు భారీ దాడులకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ మిలిటరీ ఉగ్రవాదుల దాడిని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడినట్లు పాకిస్థాన్ మిలిటరీ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ మిలిటరీ, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో పదమూడు మంది ఉగ్రవాదులు హతమవగా, 17 మంది సాధారణ పౌరులున్నారు.

Gunmen attack Pakistan air force base in Peshawar

వీరంతా ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న మసీదులో ప్రార్ధనలు చేసుకోవడానికి వచ్చారు. 8 మంది పాక్ సైనికులతో సహా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

గత కొన్ని వారాలుగా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఘటనకు సంబంధిచిన వివరాలను పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. పది మంది ఉగ్రవాదులు పెషావర్‌కు వాయవ్య దిశగా ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్‌లోకి చొరబడ్డారు.

నేరుగా గార్డు రూం వద్దకు వెళ్లిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే మిలిటరీ బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడని తెలిపారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడింది తామేనని తెహ్రిక్-ఇ-తాలిబన్ ఉగ్రవాద సంస్ధ ప్రకటించింది.

English summary
Gunmen attacked a Pakistani air force base in the volatile northwestern city of Peshawar early on Friday, a military spokesman said, the first major attack in several weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X