వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్‌లో గురుద్వారా ధ్వంసం: ఐఎస్ వ్యతిరేక రాతలు

|
Google Oneindia TeluguNews

లాస్‌ఏంజిల్స్: అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో సిక్కుల ప్రార్థనామందిరం గురుద్వారాను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా గురుద్వారా ఆవరణలో పార్క్ చేసిన ఓ ట్రక్కును ధ్వంసం చేశారు. గురుద్వారా గోడలపై ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాశారు.

కాలిఫోర్నియా నగర శివారు ప్రాంతమైన బైనా పార్క్ వద్ద గల గురుద్వారాలో డిసెంబర్ 6న ఈ ఘటన జరిగిందని గురుద్వారా సింగ్‌సభ బోర్డు సభ్యులు తెలిపారు. తమ సామాజిక వర్గ భద్రతకు ముప్పు పొంచి ఉందని గురుద్వారా అధ్యక్షుడు ఇందర్‌జోత్ సింగ్ తెలిపారు.

Gurudwara vandalized in US, anti-ISIS graffiti on its walls

ఇది శాన్‌బెర్నార్డినో ఊచకోతలకు ప్రతీకారంగా జరిగిన ప్రత్యక్ష చర్య అని అన్నారు. దీనిపై స్థానిక పోలీసులకు గురుద్వారా సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు కోసం వైట్‌హౌస్‌కు సమాచారమిచ్చారు.

కాగా, గతంల కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గత సెప్టెంబర్‌లో చికాగో నగర శివారుల్లో సిక్కు అమెరికన్ తండ్రిని బిన్‌లాడెన్‌గా పోలుస్తూ కొందరు దాడికి పాల్పడ్డారు. 2012లో విస్కోసిన్‌లోని ఓక్‌క్రీక్‌లో గల గురుద్వారాలోకి నియో నాజీ టై ధరించిన సాయుధుడు ప్రవేశించి ఆరుగురు అమాయక సిక్కులను పొట్టనబెట్టుకున్నాడు.

English summary
Anti-ISIS graffiti was left by vandals on the walls of a Sikh Gurudwara and a truck parked in its parking lot in Buena Park in Los Angeles suburbs after vandalizing it in wee hours of Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X