వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హెచ్1 బీ వీసా’ మరింత కఠినం: భారత టెక్కీలకు కష్టమే, ‘వెంటనే పంపించేస్తారు’

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: హెచ్1బీ వీసాపై అమెరికా వెళ్లడం, అక్కడ ఉండటం ఇక మరింత కష్టతరం కానుంది. డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం ఈ వీసా జారీ నిబంధలను మరింత సంక్లిష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసా గడువు తీరిపోయిన వారు ఇక అమెరికాలో ఎక్కువ రోజులు కొనసాగలేరు. వారిని దేశ బహిష్కరణ లేదా పునరాగమనంపై నిషేధం విధిస్తారు.

హెచ్‌-1బీ వీసాపై అమెరికాకి వెళ్లిన నిపుణులు.. వీసా గడువు పెంచుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తు లేదా అభ్యర్థనలు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా గడువు తీరిన తర్వాత సగటున 240రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అలాకాకుండా అనధికారికంగా అక్కడే నివసించే వాళ్లకి యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) 'నోటీస్‌ టు అప్పియర్‌(ఎన్‌టీఏ) జారీ చేస్తుంది.

H-1B visa alert: Donald Trump makes things worse for Indian techies.

ఇది జారీ చేసిన అనంతరం సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. దీనిపై విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు.

వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు.
వీసా గడువు పెంచుకోవడానికి లేదా, తమ స్టేటస్‌ మార్పుకోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయితే సదరు వ్యక్తులు వెంటనే భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. అమెరికాకు వెళ్లే విదేశీయుల పరిస్థితి ఈ కొత్త నిబంధనలతో మరింత సంక్లిష్టంగా మారనుంది.

English summary
Many H-1B holders could face deportation if their application for extension or change of status is rejected and their tenure of stay granted by the US government has expired, according to the new US Citizenship and Immigration Services (USCIS) policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X