వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విసా హోల్డర్లకు గుడ్‌న్యూస్: భార్యాబిడ్డలతో అమెరికా వెళ్లొచ్చు..కానీ: షరతులతో అనుమతి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఇప్పట్లో అడుగు పెట్టలేమనే అభిప్రాయం చాలామంది అమెరికా రిటర్నీల్లో నెలకొని ఉంది. కనీసం మరో ఏడాదైనా పట్టొచ్చనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. లక్షల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. లక్షా 60 వేలకు పైగా మరణాలతో అల్లాడుతోన్న అమెరికాలో వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి గుడ్‌న్యూస్ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ప్రైమరీ హెచ్-1బీ విసా హోల్డర్లు అమెరికా వెళ్లడానికి వీలు కల్పించింది.

Recommended Video

#H1BVisa : US Allows H-1B Visa Holders To Return For Same Jobs Before బ్యాన్ ! || Oneindia Telugu

డిపెండెంట్ల (భార్య, పిల్లలు)తో కలిసి తమ దేశానికి తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న వారు కరోనా వైరస్ ప్రబలడానికి ముందు ఉన్న హోదాల్లోనే తమ విధులను కొనసాగించడానికి, అందులో చేరడానికీ విసా క్లారిఫికేషన్లతో అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. హెచ్-1బీ విసా ఉన్న టెక్నికల్ స్పెషలిస్టులు, సీనియర్ లెవెల్ మేనేజర్లు, ఇతర వర్కర్లు తమ దేశానికి తిరిగి రావొచ్చని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.

H-1B Visa Holders Allowed To Return To US On Conditions: Trump administration

ప్రజా ఆరోగ్యం రంగంలో పనిచేసే వారు. వైద్య వృత్తిలో స్థిరపడిన నిపుణులు, వైద్య రంగానికి సంబంధించిన పరిశోధకులు అమెరికా వెళ్లడానికీ ఇదివరకు ఆదేశాలు ఇచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, కరోనా వైరస్‌ ముందు నాటి పరిస్థితుల్లోకి తీసుకుని రావడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ వెల్లడించింది. కరోనా వైరస్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. గాడి తప్పింది.

దీన్ని పునరుద్ధరించడంలో భాగంగా.. ఎలాంటి ప్రయోగాలను చేపట్టకూడదని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందునాటి పరిస్థితులను కల్పించడం వల్లే.. ఆర్థిక రంగం పూర్వస్థితికి చేరుకుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్-1బీ విసా హోల్డర్ల అమెరికాకు తిరిగి రావడానికి అనుమతి ఇవ్వాలని పేర్కొంది. ప్రైమరీ హోల్డర్లు భార్య, బిడ్డలతో కలిసి అమెరికా రావడానికి వీలు కల్పించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల భారతీయులకు పెద్ద ఎత్తున లబ్ది కలుగుతుంది.

English summary
The Trump administration has relaxed some rules for H-1B visas allowing visa holders to enter the United States if they are returning to the same jobs they had prior to the proclamation of the visa ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X