వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పిటిషన్ ఉంటేనే: హెచ్1 బీ వీసాదారులు ఎన్ని ఉద్యోగాలైనా చేయొచ్చు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వర్క్‌వీసాదారులకు శుభవార్త. వీటిని కలిగి ఉన్నవారు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన ఐటీ వృత్తినిపుణులతోపాటు అగ్రరాజ్యం వచ్చినవారిలో అనేకమంది హెచ్‌1 బీ వీసా కోసం నానాతంటాలు పడుతుండడం తెలిసిందే. ఇదొక నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా. సాంకేతికపరంగా గానీ, సైద్ధాంతికంగా గానీ, నిపుణులైన విదేశీయులు ఈ వీసా కలిగిఉన్నట్టయితే అమెరికా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
భారత్, చైనా దేశాలకు చెందిన వేలాదిమందిని అమెరికా కంపెనీలు ఈ వీసా ప్రాతిపదికన ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నియమిస్తుండడం సర్వసాధారణం.

వారంతా తప్పనిసరిగా 1 - 129 ఫారంను తమకూ, సంబంధిత యజమానికి సమర్పించాలని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది. ఇక గోల్డెన్ వీసా పొంది అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులకు అందుకు దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 22వ తేదీ వరకు ఆ దేశ ప్రభుత్వం గడువు పొడిగించింది.

 సదరు వీసా దారు ఇలా 1 - 129 ఫామ్ సమర్పించాలి

సదరు వీసా దారు ఇలా 1 - 129 ఫామ్ సమర్పించాలి

‘సాధారణంగా హెచ్‌1బీ వీసాదారులు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవడానికి వీలవుతుంది. అయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి అనుమతి పొంది ఉండాలి' అని అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. అయితే ఉద్యోగి విధుల్లో చేరేముందు ఇందుకు సంబంధించి సంబంధిత సంస్థ యజమాని.. యూఎస్‌సీఐఎస్‌కి 1-129 ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో సదరు ఉద్యోగి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇది కొత్త నిబంధన కాకపోయినప్పటికీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. విదేశాలనుంచి ఇక్కడికి రాదలుచుకున్నవారికి ఈ సంస్థ హెచ్‌1బీ వీసా దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి, ఖరారు చేస్తుంది.

 అమెరికాలో పీజీ చేసిన విద్యార్థులకు మాత్రమే

అమెరికాలో పీజీ చేసిన విద్యార్థులకు మాత్రమే

అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రతి ఏడాది 65 వేలమందికి మాత్రమే ఈ వీసాలను మంజూరు చేస్తుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు. ఇక గ్రీన్‌ కార్డులు కలిగి ఉన్నవారిలో 85 శాతం మంది ఇప్పటికే ఇక్కడ స్థిరపడిపోయారు.

 22 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

22 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

అమెరికాలో స్థిరపడాలని భావించే వారికి సువర్ణావకాశం ఇలా
అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త. ‘గోల్డెన్‌ వీసా'గా పరిగణించే ఈబీ5 వీసాల దరఖాస్తుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్‌1-బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ప్రత్యేకించి రెండు టార్గెటెడ్ ప్రాంతాల్లో (టీఈఏ)ల్లో ఐదు లక్షల దాలర్లు గానీ, మెట్రో నగర శివారు ప్రాంతాల్లో 10 లక్షల డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలనుకునేవారికి ఇది నిజంగానే బంగారం లాంటి అవకాశం.

 ఈబీ -5 వీసాలో ఆరో స్థానంలో భారత్

ఈబీ -5 వీసాలో ఆరో స్థానంలో భారత్

ఈ ఈబీ - 5 వీసా ప్రోగామ్‌ను 1990లో అమెరికా కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌1- బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు. ఈబీ వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది సువర్ణావకాశం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Foreign workers in the US on a H1B work visa, the most sought after among Indian IT professionals, may work for more than one company, the country's immigration agency has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X