వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్‌1బీ వర్క్‌ వీసా, గ్రీన్‌కార్డ్‌లో మార్పులు!: ప్రతిభావంతులకే పెద్దపీట

హెచ్1బీ వర్క్ వీసా, గ్రీన్ కార్డులలో మార్పుల తెచ్చేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ కసరత్తులు చేస్తున్నట్లు తేలిపోయింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: హెచ్1బీ వర్క్ వీసా, గ్రీన్ కార్డులలో మార్పుల తెచ్చేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ కసరత్తులు చేస్తున్నట్లు తేలిపోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు రప్పించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వర్క్‌ వీసా, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ కేటగిరి విధానాల్లో మరిన్ని మార్పులు తీసుకురానుందని డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన సెనేటర్‌ టామ్ కాటన్ వెల్లడించారు.

ఆర్కాన్సాస్‌కు చెందిన సెనేటర్‌ టామ్‌ కాటన్‌ బుధవారం ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుత వీసా విధానాలతో ఎక్కువ మంది ప్రతిభావంతులు అమెరికాకు రావడం లేదని.. వారిని ఆకర్షించే విధంగా వీసాల విధానాన్ని సవరించాలని చెప్పారన్నారు. దీనిపై ట్రంప్‌ కార్యవర్గం ఇప్పటికే కసరత్తు చేస్తోందన్నారు.

<strong>ట్రంప్ ఎఫెక్ట్: భారత సంతతి మహిళను అమెరికాలో అడుగుపెట్టనీయలేదు!</strong>ట్రంప్ ఎఫెక్ట్: భారత సంతతి మహిళను అమెరికాలో అడుగుపెట్టనీయలేదు!

ప్రస్తుతం ఉన్న హెచ్‌1బీ టెంపరరీ వీసా, ఈబీ1, ఈబీ2 వంటి గ్రీన్‌కార్డులతో అత్యుత్తమ మేథోసంపత్తిని అమెరికాకు తీసుకురావాలని అధ్యక్షుడు కోరుకుంటున్నట్లు కాటన్‌ వివరించారు. అయితే, ప్రస్తుత విధానాలతో ఈ లక్ష్యం పూర్తికావడం లేదనే అభిప్రాయంలో ట్రంప్‌ ఉన్నట్లు తెలిపారు.

H1B, employment based green card to be reformed: US Senator

పీహెచ్‌డీలు, కంప్యూటర్‌ సైంటిస్ట్‌ల స్థానంలో మధ్యరకం వారిని భర్తీ చేస్తున్నారని.. దీంతో ఇక్కడి ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అత్యున్నత సాంకేతికత అవసరం లేని డిస్నీ, సదరన్‌ కాలిఫోర్నియా ఎడిసన్‌ వంటిచోట్ల విదేశీయులను నియమించుకుంటున్నారని తెలిపారు. అసలు అమెరికన్లు చేయని పనంటూ లేదని, వారికి జీతం పొందే హక్కు ఉందని.. వారు భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలు చేస్తారని కాటన్‌ తెలిపారు.

ప్రస్తుతం కొత్త విధానంలో 15 మంది ఇమ్మిగ్రెంట్లలో కేవలం ఒకరిని మాత్రమే అమెరికాలోకి రానిస్తామన్నారు. ఇదే విషయాన్ని ట్రంప్‌ తనకు చెప్పారని కాటన్‌ తెలిపారు. కొత్త విధానాన్ని కనుక ప్రవేశపెడితే తొలి ఏడాది 6,37,960 మంది.. పదో సంవత్సరం తర్వాత 5,39,958 మంది వస్తారని అంచనా. 2015లో 10,51,031 వలసల కంటే ఇది దాదాపు 50శాతం తక్కువ. ఈ విధానం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారతీయులపై పెను ప్రభావం చూపనుంది. అంతేగాక, ఈ విధానంతో ఏడాదికి 50వేలమంది శరణార్థులు గ్రీన్ కార్డుకు దూరం కానున్నారు.

English summary
H-1B work visa and employment- based green card categories -– very popular among among Indian-Americans -- are likely to be reformed to attract the best and the brightest from across the world, a top American Senator close to President Donald Trump said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X