వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డబుల్'తో ట్రంప్ షాక్: మనోళ్లు ఏ కంపెనీలో ఎంతమంది, వారి మాటేమిటి?

ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ టంర్ప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ టంర్ప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగుల రాకను కఠినతరం చేసేలా కీలక నిబంధనలతో కూడిన బిల్లును ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

<strong>శాలరీ పెంపుతో చిక్కు: ఇండియన్స్ సహా భారీ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్</strong>శాలరీ పెంపుతో చిక్కు: ఇండియన్స్ సహా భారీ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్

గతంలో కంటే డబుల్

గతంలో కంటే డబుల్

అమెరికా వచ్చే ఉద్యోగులు వీసా పొందేందుకు కనీస వేతనం 60వేల డాలర్ల నుంచి 1.30లక్షల డాలర్లకు పెంచారు. 1989 నుంచి 60 వేల డాలర్లుగానే ఉంది. దీనిని ఇప్పటి దాకా మార్చలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ అనూహ్యంగా డబుల్ కంటే ఎక్కువ మార్చారు.

స్థానికులకు ఉద్యోగాలు

స్థానికులకు ఉద్యోగాలు

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. ట్రంప్ బిల్లు నేపథ్యంలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర సాఫ్టువేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.

డిపెండెంట్ వీసాల పరిస్థితి ఏమిటి?

డిపెండెంట్ వీసాల పరిస్థితి ఏమిటి?

ట్రంప్ ప్రభుత్వం కొత్త ఐటీ సవరణ బిల్లును తెచ్చిన నేపథ్యంలో డిపెండెంట్ వీసాల పైన వచ్చిన వారి పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. మొత్తానికి అమెరికా వలస వెళ్లాలనుకునే వారికి ట్రంప్ షాకిచ్చారని చెప్పవచ్చు.

విదేశీ ఉద్యోగులతో అమెరికా ఐటీ కంపెనీలపై భారం

విదేశీ ఉద్యోగులతో అమెరికా ఐటీ కంపెనీలపై భారం

కొత్త చట్టంతో అమెరికా ఐటీ కంపెనీలకు విదేశీ ఉద్యోగులు భారం కానున్నారు. ఎందుకంటే గతంలో కనీస వేతనం 60వేల డాలర్లుగా ఉంది. ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగిన నేపథ్యంలో అమెరికా కంపెనీలకు ఉద్యోగాలు భారం అవుతారు.

ఆందోళనలో ఉద్యోగులు

ఆందోళనలో ఉద్యోగులు

ట్రంప్ తాజా చట్టం నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే ఉన్న భారతీయుల పైన ఎంతో ప్రభావం పడనుంది. ఇప్పటికే ఉద్యోగులు ఆందోళనలో పడిపోయారు. ముఖ్యంగా దినసరి ఉద్యోగుల పైన ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది.

ఏ కంపెనీలో ఎందరు ఉద్యోగులు?

ఏ కంపెనీలో ఎందరు ఉద్యోగులు?

విప్రోలో 12,201, ఇన్ఫోసిస్‌లో 33,289, అవెంచర్‌లో 9,605, డెలాయిట్‌లో 7,606, హెచ్‌సీఎల్‌లో 6,110, ఐగేట్‌లో 4,533, టాటాలో 16,553, టెక్ మహీంద్రాలో 6,041, మైక్రోసాఫ్ట్‌లో 4,575 మంది ఉద్యోగులు ఉన్నారు.

English summary
The law sets aside 20% of the annually allocated H1B visas for small and start-up employers to ensure small businesses can compete for high-skilled jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X