వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావేళ వారి రక్తం లాలాజలంను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు.. డార్క్ వెబ్ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ప్రపంచదేశాలను కుదిపేస్తున్న నేపథ్యంలో దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే కొన్ని తప్పుడు ప్రకటనలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కష్టకాలంను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఈ మహమ్మారి చేస్తున్న విధ్వంసాన్ని సొమ్ము చేసుకుంటున్నారు హ్యాకర్లు. ప్రజల్లో భయాలను సృష్టిస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

 డార్క్ వెబ్‌లో రక్తం లాలాజలం

డార్క్ వెబ్‌లో రక్తం లాలాజలం

డార్క్ వెబ్ మార్కెట్‌లపై ప్రకటనలు పోస్టు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ డార్క్ వెబ్‌లో ఓ వ్యక్తికి సంబంధించిన పోస్టు కలకలం సృష్టించింది. కరోనావైరస్ సోకిన ఓ వ్యక్తి తన రక్తంను, మరియు లాలాజలాన్ని అమ్ముతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన డార్క్‌వెబ్‌పై పోస్టు చేశాడు. కరోనావైరస్ సోకిన వ్యక్తి రక్తం, లాలాజలంతో ఉపయోగం ఏంటనే డౌటు రావొచ్చు.. అయితే ఈ రక్తం మరియు లాలాజలంలతో కరోనావైరస్ సోకిన మరొక వ్యక్తి చికిత్సకు ఉపయోగపడుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందంటూ ప్రకటనలో తెలిపారు. ఇలా రక్తం, లాలాజలంను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు హ్యాకర్లు. దాదాపు 1000 డాలర్లకు ఇది అమ్ముకుంటున్నారు. ఇలాంటి కష్టసమయాల్లో ప్రజల్లో భయాలను సృష్టించి వారి భయాన్నే క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్లు వచ్చాయని తప్పుడు పోస్టులు పెడుతూ డబ్బులు పిండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.

ఇంతకీ డార్క్ వెబ్ అంటే ఏమిటి..?

ఇంతకీ డార్క్ వెబ్ అంటే ఏమిటి..?

డార్క్‌వెబ్ అంటే ఇది ఎన్‌క్రిప్టెడ్ ఆన్‌లైన్ కంటెంట్. ఈ వెబ్‌సైట్‌ను సాధారణ సెర్చ్ ఇంజిన్లు గుర్తించవు. దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా రెగ్యులర్ బ్రౌజర్లలో కనిపించదు. దీన్ని కేవలం సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇక ఈ ఆన్‌లైన్ వ్యాపారం అంతా బ్లాక్ మార్కెటే అని చెప్పాలి. ఇక కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఉందంటూ ఈ డార్క్‌వెబ్‌పై పోస్టు చేశారు. ఇజ్రాయిల్ సైంటిస్టులు కనుగొన్నారంటూ ఈ వెబ్‌పేజ్‌పై ప్రకటన చేశారు. ఇజ్రాయిల్‌ ప్రజలను దేవుడు దీవించును గాక అని కూడా రాశారు. ఇక వ్యాక్సిన్ కావాలనుకునే వారు 99 డాలర్లు చెల్లిస్తే వ్యాక్సిన్‌ కలిగిన 10వాయిల్స్ వస్తాయని అందులో ఉంది. ఇక డార్క్‌వెబ్‌ పై వ్యాక్సిన్ కావాలనుకునేవారు మరో చెక్ అవుట్ పేజ్‌కు తీసుకెళుతుంది. అక్కడే ఈ వ్యాక్సిన్ ఏ అడ్రస్‌కు డెలివరీ చేయాలో ఆ వివరాలను నింపాల్సిందిగా కోరుతుంది. ఇక చెల్లింపులను బిట్‌కాయిన్ ద్వారా చేయాలని సూచిస్తుంది. డార్క్ వెబ్‌ ద్వారా కేవలం వ్యాక్సిన్‌లే కాదు టెస్టింగ్ కిట్లను కూడా అమ్ముతున్నామనే ప్రకటన కూడా పెడుతున్నారు.

ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చెబుతున్నాయి..?

ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చెబుతున్నాయి..?

ఇక అమెరికాలో టెస్టింగ్ కిట్లు కొరత, వ్యక్తిగత సంరక్షణకు కావాల్సిన పరికరాలు కొరత ఉండటంతో హ్యాకర్లు దీన్ని సొమ్ముచేసుకుంటున్నారని ఇన్ సైట్స్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. ఇదంతా పచ్చి అబద్ధమని బూటకమని పేర్కొంది. ఇలాంటి వెబ్‌సైట్లపై కొనుగోలు చేయరాదని నెటిజెన్లకు సూచించింది. డబ్బులు కట్టించుకుంటారని తర్వాత మాయమవుతారని ఇదంతా పెద్ద స్కామ్‌గా ఇన్‌సైట్స్ పేర్కొంది. ఇక ప్రజలను మోసం చేసేందుకు ఈ సైబర్ నేరగాళ్లు తమ వెబ్‌సైట్లను కూడా కరోనా లేదా కోవిడ్ పేర్లతో రిజిస్టర్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Recommended Video

Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown
కరోనావైరస్ పేరుతో విపరీతంగా పెరిగిపోతున్న ఫేక్ డొమైన్లు

కరోనావైరస్ పేరుతో విపరీతంగా పెరిగిపోతున్న ఫేక్ డొమైన్లు

ఇన్‌సైట్స్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం ఇలాంటి బూటకపు వెబ్‌సైట్లు చాలా క్రియేట్ చేశారని తెలుస్తోంది. 2019లో కరోనా పేరుతో 190 డొమైన్లను క్రియేట్ చేయగా కరోనా కోవిడ్ పేర్లతో జపవరి 2020లోనే 1400 డొమైన్లు క్రియేట్ అయినట్లు సమాచారం.ఫిబ్రవరిలో ఆ సంఖ్య 5వేలకు చేరుకోగా మార్చిలో 38వేలకు చేరుకుందని ఇన్‌సైట్స్ తెలిపింది. ఇక కరోనావైరస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తుండటం గమనించిన హ్యాకర్లు జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ మ్యాప్‌ బూటకపు వెర్షన్‌ను క్రియేట్ చేశారు. ఎందుకంటే చాలామంది కరోనావైరస్ సమాచారం కోసం జాన్ హాప్కిన్స్ సైట్ చూస్తారన్న విషయం తెలిసి ఇలాంటి ఫేక్‌ డొమైన్‌ను క్రియేట్ చేశారని ఇన్‌సైట్స్ తెలుపుతోంది. కరోనావైరస్ ప్రారంభమైనప్పటి నుంచి హ్యాకర్ల ఆగడాలు రెట్టింపు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతెలిపింది.

English summary
The ad on Own Shop, a dark web market, claims the vendor has been infected by coronavirus and is now selling their blood and saliva, which in theory could be immune to the virus and used to treat other coronavirus patients
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X