వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్ టైమ్స్ సంచలనం: వాళ్లు ఇండియాలోనే ఉన్నారు, ఉ.కొరియా సైబర్ హ్యాక్ వెనుక!

ఉత్తరకొరియా సైబర్ దాడులను తిప్పి కొట్టేందుకు.. అమెరికా, దక్షిణ కొరియా కూడా ఆ దేశ సాఫ్ట్‌వేర్లను హ్యాక్‌ చేసుందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఉత్తరకొరియా వాడుతున్న హార్డ్‌వేర్‌లు పాత కాలం నాటివి కావడంత

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియాలో దుర్భర పరిస్థితుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడి ప్రజల సంక్షేమం,అభివృద్దికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి బాధ్యతా తీసుకోదు. పైపెచ్చు పేదరికం పట్ల ఒకలాంటి వివక్ష కూడా ప్రభుత్వం వైపు నుంచే కొనసాగుతున్నట్టు కనిపిస్తుంటుంది.

ఉత్తరకొరియా రాజధాని ప్యోంగ్ యాంగ్ లో కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. పేదరికంలో మగ్గిపోతున్నవాళ్లను నగరంలోకి అనుమతించరనే వాదన కూడా ఉంది. కేవలం రాజధాని ప్రాంతంలోనే వసతుల కల్పన ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కనీసం విద్యుత్ సదుపాయం కూడా ఉండదు.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

నియంత్రుత్వ పోకడలతో ఉత్తరకొరియా జనజీవనాన్ని మరింత అంధకారంలోకి నెడుతున్న అధ్యక్షుడు కిమ్ జాంగ్ కు అక్కడి దారిద్య్రాన్ని రూపుమాపాలన్న ఆలోచన ఏ కోశానా లేదు. పైగా యుద్ద తంత్రంతో ప్రపంచాన్ని ఢీకొట్టాలని తహతహలాడుతున్నాడు.

సైబర్ ఎటాక్:

సైబర్ ఎటాక్:

ఓవైపు అణు క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను బెంబేలెత్తిస్తూనే మరోవైపు సైబర్ దాడుల ద్వారా కూడా ఉత్తరకొరియా విరుచుకుపడుతోంది. ఐరాస ఆంక్షలతో ఉత్తరకొరియా వాణిజ్యం పూర్తిగా కుంటుపడిపోయి ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఇలాంటి తరుణంలో ఉత్తరకొరియాకు సైబర్ దాడులు చేయించేంత సామర్థ్యం ఉందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం కూడా అంతగా లేని దేశంలో ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

న్యూయార్క్ టైమ్స్ సంచలనం:

న్యూయార్క్ టైమ్స్ సంచలనం:

సైబర్ దాడులు చేసేంత సామర్థ్యం ఉత్తరకొరియాకు లేకపోయినప్పటికీ.. బయటి దేశాల నుంచే ఈ చర్యకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలపై ఉత్తరకొరియా భారీగా సైబర్‌ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో చాలా పరిమితంగా మాత్రమే తమ దేశం నుంచి ఉత్తరకొరియా ఆపరేషన్స్ చేస్తోంది. మిగతా పనిని ఆయా దేశాల్లో హ్యాకర్లకు అప్పగించింది. ఇందులో భారత్ నుంచి పనిచేస్తున్న హ్యాకర్లు కూడా ఉన్నట్టు వార్తలు వస్తుండటం విస్మయం కలిగిస్తోన్న విషయం. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ద.కొరియాలో మాత్రమే కనిపించే కల్చర్స్: టాప్-5 షాకింగ్ విషయాలు..ద.కొరియాలో మాత్రమే కనిపించే కల్చర్స్: టాప్-5 షాకింగ్ విషయాలు..

భారీ సైబర్ దళం:

భారీ సైబర్ దళం:

కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ హయాంలో 1990వరకు ఉత్తరకొరియా వద్ద సైబర్ నిపుణులు అంతగా లేరు. కంప్యూటర్ సామాగ్రి కూడా అంతగా ఉండేది కాదు. కానీ ఆ తర్వాతి కాలంలో ఇల్ సైబర్ నిపుణుల అవసరాన్ని గుర్తించి.. భారీ సంఖ్యలో ఆ దిశగా రిక్రూట్ మెంట్లు చేపట్టాడు. ఆయన మరణానంతరం కిమ్ జాంగ్ ఉన్ కూడా అదే పరంపరను కొనసాగిస్తూ వచ్చాడు. దీంతో ఉత్తరకొరియా సైబర్ దళం పటిష్టంగా తయారైంది. అది ఎంతలా అంటే.. ఏకంగా సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఓ హాస్య చిత్రాన్ని హ్యాక్ చేసేంతలా!. హ్యాకింగ్ దెబ్బకు సోనీ కంపెనీ చిత్రాన్నే నిలిపేసింది.

రష్యన్ కంపెనీతో డీల్: 'కిమ్' రూట్ మార్చాడా?, ప్రపంచానికి సైబర్ ముప్పు!..రష్యన్ కంపెనీతో డీల్: 'కిమ్' రూట్ మార్చాడా?, ప్రపంచానికి సైబర్ ముప్పు!..

భారత్ లోను ఉ.కొరియా హ్యాకర్లు:

భారత్ లోను ఉ.కొరియా హ్యాకర్లు:

ఉత్తరకొరియా సైబర్ దాడులను తిప్పి కొట్టేందుకు.. అమెరికా, దక్షిణ కొరియా కూడా ఆ దేశ సాఫ్ట్‌వేర్లను హ్యాక్‌ చేసుందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఉత్తరకొరియా వాడుతున్న హార్డ్‌వేర్‌లు పాత కాలం నాటివి కావడంతో, డేటా హ్యాక్ చేయడం కష్టంగా మారింది.

ప్రస్తుతం ఉత్తరకొరియా హ్యాకింగ్‌ టీమ్స్ ప్రపంచవాప్తంగా విస్తరించాయి. ఇందులో భారత్‌ కూడా ఉండటం.. ఉత్తరకొరియా సైబర్ దాడుల్లో భారత్ నుంచే ఐదోవంతు మేర ఆపరేషన్స్ జరుగుతుండటం గమనార్హం. అమెరికాకు చెందిన 'రికార్డెడ్‌ ఫ్యూచర్‌' అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

భారత్‌లోని 7 యూనివర్సిటీల్లో ఉత్తర కొరియా విద్యార్థులు చదువుకుంటున్నట్టుగా రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ తెలిపింది. ప్రభుత్వ, పరిశోధనా విభాగాల్లో కూడా వీరు పని చేస్తుండవచ్చునని, హ్యాకింగ్ లో వీరి ప్రమేయం ఉంటుందన్న అనుమానాలను వెలిబుచ్చింది.

భారత్ లోని కీలక సంస్థలపై కూడా:

భారత్ లోని కీలక సంస్థలపై కూడా:

భారత్ లోని కీలక సంస్థలపై కూడా ఉత్తరకొరియా సైబర్ దాడులు కొనసాగుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, ఇండియన్‌ నేషనల్‌ మెటలార్జికల్‌ లేబరేటరీలే లక్ష్యంగా హ్యాకర్లు పనిచేస్తున్నారని పేర్కొంది.

కాగా, గతంలో భారత్-ఉత్తరకొరియాల మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. కానీ కిమ్ జాంగ్ ఉన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్ ఆ దేశంతో సంబంధాలను తగ్గించుకుంది. ఇటీవల ఉత్తరకొరియాపై ఐరాస విధించిన ఆంక్షలను కూడా మోడీ ప్రభుత్వం సమర్థించింది.

అసామన్యం: ఉ.కొరియా ఎంతలా ఎదిగిందంటే?, రహస్య డాక్యుమెంట్లలోనే అదే..అసామన్యం: ఉ.కొరియా ఎంతలా ఎదిగిందంటే?, రహస్య డాక్యుమెంట్లలోనే అదే..

English summary
North Korea is often seen to be one of the most isolated countries in the present world. Yet, in one matter, the country is hyper connected: cyber warfare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X