వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అద్యక్షుడితో ట్రంప్ సమావేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ :అమెరికా అద్యక్షుడు బరాక్ ఓబామాతో అధ్యక్ష భాద్యతలు స్వీకరించబోయే ట్రంప్ సమావేశమయ్యారు. ఇద్దరి మద్య మంచి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. అనేక అంశాలపై ఇద్దరు చర్చించారు.విదేశీ వ్యవహారాలు,దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.ఇద్దరు కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

ఇద్దరు సుమారు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు.తమ ఇద్దరి మద్య సమావేశం చాలా బాగా జరిగిందని బరాక్ ఒబామా ప్రకటించారు.ఇద్దరందేశంలో నెలకొన్న సమస్యలతో పాటు విదేశీ వ్యవహారాలపై చర్చించిన విషయాన్ని ఒబామా ప్రకటించారు.;పార్టీలకు అతీతతంగా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయాల్సిన సమయమిదని ఒబామా అభిప్రాయపడ్డారు.

ట్రంప్ కూడ ఈ సమావేశంపై సానుకూలంగా స్పందించారు. ఇద్దరి మద్య సమావేశం మంచి వాతావరణంలో జరిగిందన్నారు. ఒబామాతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు.ఒబామాను ట్రంప్ పొగిడారు. ఒబామా తీసుకొన్న నిర్ణయాలను ప్రస్తావించారు అంతే కాదు ఒబామాను తాను గౌరవిస్తానని ట్రంప్ చెప్పారు.

Had an excellent conversation with Trump, says Obama

అమెరికా అధ్యక్షుడు చాలా మంచి మనిషని ట్రంప్ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్తుతించారు.ఒబామాతో కలిసి భవిష్యత్తులో కలిసి నడవాలని భావిస్తున్నానని, ఇలా కలుసుకోవడం తనకు గొప్ప అనుభూతిని కలిగిస్తోందని ట్రంప్ చెప్పారు.ట్రంప్ తో కలిసి వచ్చిన అతని సతీమణి మెలానీయా , ఒబామా సతీమణి మిషెల్లీతో సమావేశమయ్యారు.ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మైక్ పెనిస్ ట్రంప్ తో కలిసి వచ్చారు.

న్యూయార్క్ నుండి తన ప్రైవేట్ జెట్ విమానంలో రీజినల్ ఎయిర్ పోర్ట్ లో దిగాడు ట్రంప్. అందరితో కాకుండా ఒబామా, ట్రంప్ లు ఏకాంతంగా చాలా సేపు సమావేశమయ్యారు.ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ను ఒబామా విమర్శలతో ముంచెత్తారు.అమెరికా అద్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడని, సమానం కాదని ఆయన దుమ్మెత్తిపోశారు.కాని, ఎన్నికల్లో ట్రంప్ కే అమెరికా ప్రజలు పట్టం కట్టడంతో ఈ ఫలితాన్ని అంగీకరించాలని ఒబామా ప్రజలను కోరారు..

English summary
US President Barack Obama today met for the first time his successor Donald Trump at the White House and vowed his support for him as the two leaders discussed domestic and foreign policy issues to take a step towards transition of power after a bitterly fought election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X