• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబై మార‌ణ‌హోమం మాస్ట‌ర్‌మైండ్ హ‌ఫీజ్ స‌యీద్ అరెస్ట్‌!

|

లాహోర్‌: ముంబై పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి, జ‌మాత్‌-ఉద్‌-ద‌వా సంస్థ అధినేత హ‌ఫీజ్ స‌యీద్ పాకిస్తాన్‌లో అరెస్ట్ అయ్యారు. ఉగ్ర‌వాద వ్య‌తిరేక ద‌ళ అధికారులు ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్లు పాకిస్తాన్ మీడియా వెల్ల‌డించింది. లాహోర్ నుంచి గుజ్ర‌న్‌వాలాకు వెళ్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో అధికారుల‌ను ఆయ‌న‌ను త‌మ అదుపులోకి తీసుకున్నార‌ని జ‌మాత్‌-ఉద్‌-ద‌వా సంస్థ అధికార ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించిన‌ట్లు ఆ దేశ మీడియా స్ప‌ష్టం చేసింది. హ‌ఫీజ్ స‌యీద్‌ను ఏ నేరం కింద అరెస్టు చేశార‌నేది ఇంకా తెలియ‌రావ‌ట్లేదు. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, ఉగ్రవాదుల‌కు ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నార‌నే కార‌ణంతోనే హ‌ఫీజ్ స‌యీద్‌ను అరెస్ట్ చేసి ఉండ‌వ‌చ్చని స‌మాచారం.

ద‌ళారుల‌కు పండ‌గే! టీటీడీలో వీఐపీల క‌ట్ట‌డి ఉత్తిదేనా? కొత్తది తీసి పాత విధానం తెస్తారా?

26/11 పేలుళ్లు సూత్ర‌ధారి అత‌డే

2008 న‌వంబ‌ర్ 11వ తేదీన దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైపై ఉగ్ర‌వాదులు చేసిన మ‌హోగ్ర‌దాడిని ఎవ‌రూ మ‌రిచిపోలేరు. రైల్వేస్టేష‌న్, తాజ్ హోట‌ల్ స‌హా వివిధ ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు నిర్వ‌హించిన మెరుపుదాడుల్లో 165 మంది మ‌ర‌ణించారు. వంద‌లాదిమంది గాయ‌ప‌డ్డారు. ఈ దాడికి ప్ర‌ధాన సూత్ర‌ధారి హ‌ఫీజ్ స‌యీద్‌. దాడుల సంద‌ర్భంగా మ‌న‌దేశ భ‌ద్ర‌తా ద‌ళాల చేతికి స‌జీవంగా దొరికిన ఉగ్ర‌వాది క‌స‌బ్ ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారం.. ఈ విష‌యాన్ని నిర్దారించారు. పాకిస్తాన్‌లో సైతం హ‌ఫీజ్ స‌యీద్‌పై 23 కేసులు న‌మోద‌య్యాయి. అగ్ర‌రాజ్యం అమెరికాపై దాడి చేసిన అల్‌ఖైదా వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌డైన హ‌ఫీజ్‌ను అరెస్టు చేయాలంటూ అంత‌ర్జాతీయంగా ఒత్తిడి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఏనాడూ చ‌ర్య‌లు తీసుకోలేదు. తాజాగా- ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Hafiz Saeed, Mumbai Attacks Mastermind, Arrested, Sent To Jail: Pak Media

హ‌ఫీజ్‌పై క‌న్నేసిన ఫ్రాన్స్‌..

ఫ్రాన్స్‌కు చెందిన ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ బ‌ల‌గం అధికారులు హ‌ఫీజ్ స‌యీద్‌పై కార్య‌క‌లాపాల‌పై మూడేళ్ల నుంచీ నిఘా ఉంచింది. ఉగ్ర‌వాద సంస్థ‌లు, ఉగ్ర‌వాద ప్రోత్సాహిక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న పెద్ద ఎత్తున ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నార‌ని ధృవీక‌రించింది. హ‌ఫీజ్‌ను వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని కోరుతూ అదే ఏడాది పాకిస్తాన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో హ‌ఫీజ్ అరెస్ట్ అయిన‌ట్టే అయి.. మ‌ళ్లీ బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చారు. అప్ప‌టి నుంచీ ఆయ‌న‌ను పాకిస్తాన్ ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకునే సాహ‌సానికి పూనుకోలేక‌పోయింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా- హ‌ఫీజ్‌ను మ‌రోసారి అరెస్టు చేశారు. లాహోర్ నుంచి పాకిస్తాన్ సెంట్ర‌ల్ ప్రాంతంలోని గుజ్ర‌న్‌వాలాకు వెళ్తున్న ఆయ‌న‌ను ఆ దేశ ఉగ్ర‌వాద వ్య‌తిరేక ద‌ళం అధికారులు అరెస్ట్ చేశారు.

English summary
Hafiz Saeed, the Mumbai attacks mastermind, has been arrested and sent to jail in Pakistan, reported on Wednesday quoting Pakistani media. He was sent to judicial custody and will face trial, said reports from Pakistan. A spokesman for the Jamaat ud-Dawa (JuD), an organisation run by Hafiz Saeed, said counter-terrorism officials arrested him while he was on his way from Lahore to the central Pakistan town of Gujranwala. The charges he faces are still unknown but appear to be linked to terrorism financing, the spokesman added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more