వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: సొంత‌కారులో ద‌ర్జాగా! ఉగ్ర‌వాదికి పాక్ అధికారుల వీఐపీ ట్రీట్‌మెంట్‌!

|
Google Oneindia TeluguNews

లాహోర్‌: దేశాన్ని వ‌ణికించిన 2008 న‌వంబ‌ర్ 26వ తేదీ నాటి ముంబై పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి, జ‌మాత్‌-ఉద్‌-ద‌వా సంస్థ అధినేత హ‌ఫీజ్ స‌యీద్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ల‌భిస్తోంది. ఉగ్ర‌వాద వ్య‌తిరేక కార్య‌క‌లాపాల ద‌ళం అధికారుల అదుపులో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న స్వేచ్ఛ‌గా తిర‌గ గ‌లుగుతున్నారు. త‌న సొంత వాహ‌నాన్ని వాడుతున్నారు. చుట్టూ న్యాయ‌వాదులు, త‌న అనుచ‌రుల మ‌ధ్య ఆయ‌న ద‌ర్జాగా తిరుగుతున్నారు. గుజ్ర‌న్‌వాలా న్యాయ‌స్థానానికి హాజ‌రైన సంద‌ర్భంగా ఈ దృశ్యం క‌నిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. త‌న సొంత‌కారును వినియోగిస్తుండ‌టం, ఆయ‌న చుట్టూ న్యాయ‌వాదులు, సొంత అనుచ‌రులు ఉండ‌టం ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు.

రాయ‌ల్ ట్రీట్‌మెంట్‌..

రాయ‌ల్ ట్రీట్‌మెంట్‌..

ప్ర‌స్తుతం ఆయ‌న పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఉగ్ర‌వాద వ్య‌తిరేక బ‌ల‌గాల ఆధీనంలో ఉన్నారు. ఆ విభాగం అధికారులు గురువారం ఉద‌యం ఆయ‌న‌ను గుజ్ర‌న్‌వాలా న్యాయ‌స్థానానికి హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం.. ఆయ‌న‌కు ఏడు రోజుల క‌స్ట‌డీని విధించింది. హ‌ఫీజ్ స‌యీద్ బుధ‌వారం అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. లాహోర్ నుంచి గుజ్ర‌న్‌వాలాకు వెళ్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో అధికారుల‌ను ఆయ‌న‌ను త‌మ అదుపులోకి తీసుకున్నార‌ని జ‌మాత్‌-ఉద్‌-ద‌వా సంస్థ అధికార ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించిన‌ట్లు ఆ దేశ మీడియా స్ప‌ష్టం చేసింది. హ‌ఫీజ్ స‌యీద్‌ను ఏ నేరం కింద అరెస్టు చేశార‌నేది ఇంకా తెలియ‌రావ‌ట్లేదు. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, ఉగ్రవాదుల‌కు ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నార‌నే కార‌ణంతోనే హ‌ఫీజ్ స‌యీద్‌ను అరెస్ట్ చేసి ఉండ‌వ‌చ్చని స‌మాచారం.

26/11 పేలుళ్లు సూత్ర‌ధారి అత‌డే

26/11 పేలుళ్లు సూత్ర‌ధారి అత‌డే

2008 న‌వంబ‌ర్ 11వ తేదీన దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైపై ఉగ్ర‌వాదులు చేసిన మ‌హోగ్ర‌దాడిని ఎవ‌రూ మ‌రిచిపోలేరు. రైల్వేస్టేష‌న్, తాజ్ హోట‌ల్ స‌హా వివిధ ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు నిర్వ‌హించిన మెరుపుదాడుల్లో 165 మంది మ‌ర‌ణించారు. వంద‌లాదిమంది గాయ‌ప‌డ్డారు. ఈ దాడికి ప్ర‌ధాన సూత్ర‌ధారి హ‌ఫీజ్ స‌యీద్‌. దాడుల సంద‌ర్భంగా మ‌న‌దేశ భ‌ద్ర‌తా ద‌ళాల చేతికి స‌జీవంగా దొరికిన ఉగ్ర‌వాది క‌స‌బ్ ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారం.. ఈ విష‌యాన్ని నిర్దారించారు. పాకిస్తాన్‌లో సైతం హ‌ఫీజ్ స‌యీద్‌పై 23 కేసులు న‌మోద‌య్యాయి. అగ్ర‌రాజ్యం అమెరికాపై దాడి చేసిన అల్‌ఖైదా వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌డైన హ‌ఫీజ్‌ను అరెస్టు చేయాలంటూ అంత‌ర్జాతీయంగా ఒత్తిడి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఏనాడూ చ‌ర్య‌లు తీసుకోలేదు. తాజాగా- ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

హ‌ఫీజ్‌పై క‌న్నేసిన ఫ్రాన్స్‌..

ఫ్రాన్స్‌కు చెందిన ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ బ‌ల‌గం అధికారులు హ‌ఫీజ్ స‌యీద్‌పై కార్య‌క‌లాపాల‌పై మూడేళ్ల నుంచీ నిఘా ఉంచింది. ఉగ్ర‌వాద సంస్థ‌లు, ఉగ్ర‌వాద ప్రోత్సాహిక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న పెద్ద ఎత్తున ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నార‌ని ధృవీక‌రించింది. హ‌ఫీజ్‌ను వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని కోరుతూ అదే ఏడాది పాకిస్తాన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో హ‌ఫీజ్ అరెస్ట్ అయిన‌ట్టే అయి.. మ‌ళ్లీ బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చారు. అప్ప‌టి నుంచీ ఆయ‌న‌ను పాకిస్తాన్ ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకునే సాహ‌సానికి పూనుకోలేక‌పోయింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా- హ‌ఫీజ్‌ను మ‌రోసారి అరెస్టు చేశారు. లాహోర్ నుంచి పాకిస్తాన్ సెంట్ర‌ల్ ప్రాంతంలోని గుజ్ర‌న్‌వాలాకు వెళ్తున్న ఆయ‌న‌ను ఆ దేశ ఉగ్ర‌వాద వ్య‌తిరేక ద‌ళం అధికారులు అరెస్ట్ చేశారు.

English summary
Mumbai 26/11 terror attacks mastermind Hafiz Saeed following his arrest by the Punjab Counter-Terrorism Department in Lahore, Pakistan. He was earlier on Wednesday arrested by Punjab CTD from Lahore and was sent to prison on judicial remand. He is going to face trial on the charges against him. The video shows Hafiz Saeed around lawyers and officers of the Punjab CTD, following his arrest. In the video, he can be seen leaving Pakistan's Gujranwala Court after being sent to 7 days judicial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X