వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్‌కు అయిదేళ్ల జైలు: అమలు చేస్తారా? డ్రామాలకు తెర తీస్తారా?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిప ఉగ్రవాద సంస్థ జమాత్-వుద్-దవా అధినేత హఫీజ్ సయీద్‌కు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. రెండు కేసుల్లో ఆ ఆరోపణలు రుజువు అయ్యాయి. దీనితో లాహోర్ న్యాయస్థానం ఆయనకు అయిదేళ్ల జైలు శిక్షు విధించింది.

అంతర్జాతీయ ఉగ్రవాద ముద్ర కోసం..

అంతర్జాతీయ ఉగ్రవాద ముద్ర కోసం..

మనదేశంలో కల్లోలాన్ని సృష్టించిన 26/11 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీదే. ఈ ఘటన అనంతరం ఆయనపై అంతర్జాతీయ ఉగ్రవాద ముద్రను వేయడానికి భారత్ పలు ప్రయత్నాలు చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించింది. అయినప్పటికీ.. చైనా అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అదే సమయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (పీఏటీఎఫ్) మాత్రం హఫీజ్ సయీద్ ఉగ్రవాద ప్రోత్సాహక చర్యలను గుర్తించింది.

హఫీజ్‌ కదలికలపై పీఏటీఎఫ్ నిఘా

హఫీజ్‌ కదలికలపై పీఏటీఎఫ్ నిఘా


అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఏర్పాటైన సంస్థ పీఏటీఎఫ్. ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు, విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడే వారికి వివిధ మార్గాల నుంచి అందుతోన్న ఆర్థిక వనరులను నిలిపివేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఉగ్రవాద సంస్థలకు హఫీజ్ సయీద్ నిధులను సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోంది.

రెండు కేసుల్లో నేరారోపణలు రుజువు..

రెండు కేసుల్లో నేరారోపణలు రుజువు..


హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తున్నారనే విషయాన్ని ప్యారిస్‌లో ఏర్పాటైన పీఏటీఎఫ్ ప్లీనరీలో రెండు రోజుల కిందటే నిర్ధారించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని కూడా చేసింది. ఈ తీర్మానం చేసిన రెండు రోజుల వ్యవధిలోనే లాహోర్ న్యాయస్థానం హఫీజ్ సయీద్‌కు శిక్షను ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో లాహోర్ న్యాయస్థానం మొత్తం 20 మందిని ప్రశ్నించింది.

అరెస్టయినా.. స్వేచ్ఛగా..

అరెస్టయినా.. స్వేచ్ఛగా..

నిజానికి గత ఏడాదిలో హఫీజ్ సయీద్‌పై మొత్తం 29 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిల్లో కొన్ని కేసుల్లో ఆయన అరెస్టు అయ్యారు. అనంతరం బెయిల్‌పై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. హఫీజ్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం, ఆయనకు జైలుశిక్ష విధించడాన్ని డ్రామాగా అభివర్ణించింది మనదేశ ప్రభుత్వం. అంతర్జాతీయ దేశాల నుంచి వస్తోన్న ఒత్తిళ్లకు తలొగ్గి.. నామమాత్రంగా అరెస్టు చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ సారి కూడా దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది. పీఏటీఎఫ్ తీర్మానం చేసిన రెండు రోజుల్లోనే హఫీజ్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడినప్పటికీ.. దాన్ని పక్కాగా అమలు చేయాలనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

English summary
Jamat-ud-Dawa (JuD) chief Hafiz Saeed has been convicted by a Pakistan court in terror financing cases. The Mumbai terror attack mastermind has been sentenced to five years in jail. This comes two days before the Financial Action Task Force's plenary in Paris that will decide on Pakistan's blacklisting/greylisting. Earlier on Tuesday, an anti-terrorism court in Pakistan had accepted a plea of Hafiz Saeed to club all six terror financing cases against him and his aides. The anti-terrorism court had indicted Saeed and others on December 11 in terror financing case in a day-to-day hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X