వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ హైడ్రాకు చావులేదు!: చిరకాలం బతికే ఉంటుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: మృత్యువును సైతం ఓడించగల జీవి ఉందా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ చిన్న హైడ్రా చిరకాలం బతికి ఉంటున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. దాని వయసులో క్షీణత ఏమాత్రం కనిపించడం లేదని వారు అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మంచినీటిలో నివసించే ఒక సెంటీమీటర్ పొడవు ఉండే హైడ్రా జీవిలో వయసులో ఎలాంటి క్షీణత కనిపించిన దాఖలాలు లేవని, సరైన మంచి పరిస్థితుల మధ్య ఉంచితే ఎల్లకాలం బతికి ఉంటుందని చెబుతున్నారు.

 Hail the Hydra, an animal that may be immortal

అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తే ఎలాంటి వార్ధక్య లక్షణాలు లేకుండా జీవిస్తుందని తమ పరిశోధనలో తేలినట్లు అమెరికా ఫోమొనా కళాశాల శాస్త్రవేత్త డేనియల్ మార్టినెజ్ చెప్పారు. సరైన పరిస్థితులు ఉంటే ఓ హైడ్రా ఎప్పటికీ జీవిస్తుందన్నారు.

అయినప్పటికీ హైడ్రా చిరకాలం బతికే అవకాశాలు తక్కువేనని, దానికి కారణం ఉందని చెబుతున్నారు. అవి ఇతరులకు ఆహారంగా మారటం, కాలుష్యం, వ్యాధుల వంటి ప్రమాదాలకు లోనవడం వల్ల చనిపోతాయని చెబుతున్నారు.

English summary
A new study finds that hydra — spindly, freshwater polyps can live seemingly forever, without aging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X