వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూలై 29 నుంచి హజ్ యాత్ర..ఎంతమందికి అనుమతి ఉందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అంతేకాదు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా బ్రేక్ వేశాయి. ప్రపంచవ్యాప్తంగా పేరున్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులు మూసివేయడం జరిగింది. తాజాగా ఆంక్షల మధ్య దర్శనాలను కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఎంతో పవిత్రమైనదిగా భావించే హజ్ యాత్ర ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇందుకోసం సౌదీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. సాధారణంగా పవిత్రమైన హజ్‌ను కొన్ని కోట్ల మంది సందర్శిస్తారు. కానీ ఈ సారి మాత్రం కరోనా వైరస్‌తో అక్కడి ప్రభుత్వం సందర్శకుల సంఖ్యపై ఆంక్షలు విధించింది.

 డేంజర్‌లో తెలంగాణ జిల్లాలు: కరోనావైరస్ కాటుకు బలయ్యే అవకాశాలు ఎక్కువ: స్టడీ డేంజర్‌లో తెలంగాణ జిల్లాలు: కరోనావైరస్ కాటుకు బలయ్యే అవకాశాలు ఎక్కువ: స్టడీ

హజ్‌ యాత్రకు 1000 మందిని మాత్రమే అనుమతిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా అక్కడ ప్రతిరోజు జరిగే నమాజ్‌ కార్యక్రమంలో దాదాపు 2.5 మిలియన్ మంది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. ఇక ఈ మొత్తం ఘట్టంలో అతి ప్రాధాన్యమైనది మౌంట్ అరాఫత్. ఇది గురువారం రోజున వస్తుంది. ఏటా జరిగే హజ్ యాత్ర తొలిరోజు బుధవారం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.ఇక హజ్ సమయాలు చంద్రుడి కదలికలపై ఆధారపడి ఉంటాయి.

Hajj pilgrimage to start from 29th July,Only 1000 people allowed

ఇదిలా ఉంటే హజ్ యాత్రపై ఒక నిర్దిష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని సౌదీ ప్రభుత్వం గతనెలలో తెలిపింది. ప్రస్తుతం కరోనావైరస్ కేసులు అక్కడ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటు రాజకీయంగా అటు ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఏటా జరిగే హజ్ యాత్ర మరియు ఉమ్రా యాత్రలతో సౌదీ ప్రభుత్వానికి 12 బిలియన్ డాలర్లమేరా ఆదాయం చేకూరుతుంది.

ఇప్పటికే హజ్‌కు చేరుకున్న వారిలో సౌదీ దేశస్తులతో పాటుగా విదేశీయులు ఉన్నారు. అయితే 1000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే 10వేల మంది వరకు హాజరవుతారని అక్కడి స్థానిక మీడియా చెబుతోంది. ఇక కరోనావైరస్ బారిన పడి కోలుకున్న మెడికల్ సిబ్బంది, భద్రతా సిబ్బందిలపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక సౌదీ దేశం బయట నుంచి హజ్ సందర్శనకు రావాలనుకునే భక్తులకు అనుమతి ఇవ్వకపోవడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక మక్కా సందర్శనకు వచ్చే భక్తులకు ముందుగా కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తారు.ఇక ఆ తర్వాత సందర్శనకు అనుమతిస్తారు. సందర్శన తర్వాత వారంతా క్వారంటైన్‌లో ఉండాలని సౌదీ ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

English summary
This year's Hajj, which has been scaled back dramatically to include only about 1,000 Muslim pilgrims because of the coronavirus pandemic, will begin on July 29, Saudi authorities said on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X