హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హ్యాపీ న్యూఇయర్ 2019: అక్కడ అప్పుడే ఘన స్వాగతం, కళ్లు మిరుమిట్లు గొలిపేలా.. (వీడియోలు)

|
Google Oneindia TeluguNews

అక్లాండ్/సిడ్నీ/ముంబై: న్యూజిలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్లాండ్‌లో 2019 కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. 2019వ సంవత్సరంలోకి న్యూజిలాండ్ ప్రప్రథమంగా అడుగు పెట్టింది.

న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి అందరి కన్నా ముందుగానే స్వాగతం పలికారు. కొత్త సంవ‌త్స‌రంలోకి ఈ దేశ ప్రజలు ప్రథమంగా అడుగు పెట్టారు. 2019కి మొదటగా కిరీట్‌మటి, సమోవా, న్యూజిలాండ్ ఆహ్వానం ప‌లికాయి.

మరోవైపు, ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. 2018కి వీడ్కోలు పలుకుతూ 2019కి స్వాగతం పలుకుతూ యువత కేరింతలు కొట్టారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో రోడ్ల మీదకు వచ్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

బాణసంచాతో మిరుమిట్లు గొలిపిన అక్లాండ్

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్‌టన్‌లలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కళ్లు చెదిరే బాణ సంచాతో ఆక్లాండ్ సిటీ మిరుమిట్లు గొలిపాయి. భూమి మీద న్యూఇయర్ వేడుకలు మొదటగా జరుపుకునేది సమోవా దేశం. ఇక్కడ సుమారు రెండు లక్షల మంది జనాభా ఉంది. వారు మనకంటే (భారత్) ఎనిమిదిన్నర గంటల ముందు ఉన్నారు.

అక్లాండ్‌లో టవర్ వద్ద కౌంట్ డౌన్, అక్లాండ్, సిడ్నీలలో వేడుకలు

ఆ తర్వాత గంటకు న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాది సంబరాలు జరుపుకున్నారు. అక్లాండ్‌, సిడ్నీ సహా అంతటా కొత్త ఏడాది వేడుకలు ఆకర్షించాయి. అక్లాండ్‌లో కౌంట్ డౌన్ ప్రారంభంచి.. ఆ తర్వాత టవర్.. బ్రిడ్జి పైన వెలుగులు విరజిమ్మేలా లైట్స్, టపాసులు పేల్చారు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం భారత్ కంటే ఐదున్నర గంటల ముందు కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటుంది.

ముంబై వాసుల ఏడాది చివరి సూర్యాస్తమయం

ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఈ ఏడాది (2019) చివరి సూర్యాస్తమయాన్ని చూస్తున్న ముంబైవాసులు.

సిడ్నీలో టపాసులు పేల్చారు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొత్త ఏడాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిడ్నీలో ఆా చోట్ల టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న దృశ్యం.

స్వాగతం పలికిన సిడ్నీ

సిడ్నీ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వాసులు మనకంటే కొద్ది గంటల ముందే కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటారు. సిడ్నీలోని బ్రిడ్జి పైన భారీగా వెలుగులు విరజిమ్మే లైట్లు అమర్చారు. టపాసులు పేల్చారు.

English summary
The New Year's celebrations have kicked off. Yes, New Zealand has become the first nation in the world to ring in the new year. Fireworks lit up Sky Tower in Auckland as the country bid adieu to 2018 and counted down to 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X