వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై హార్వర్డ్ వర్సిటీ సంచలనం.. కొట్టిపారేసిన చైనా.. అదే నిజమైతే మరింత భయంకరం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌కు సంబంధించి చైనా ప్రపంచానికి చెబుతున్న లెక్కలు,విషయాలపై అనేక అనుమానాలున్నాయి. ఇది కుట్రపూరితంగా జరిగిందా.. లేక సహజంగానే పుట్టుకొచ్చిన వైరసా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైరస్ వుహాన్‌లో మొట్టమొదటిసారి ఎప్పుడు బయటపడిందన్నది ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరిలో చైనా డబ్ల్యూహెచ్ఓకి సమాచారం ఇవ్వడంతో.. అప్పటినుంచి ప్రపంచ దేశాలు దీనిపై అప్రమత్తమయ్యాయి. కానీ చైనాలో నిరుడు అగస్టులోనే వైరస్ మూలాలు బయటపడ్డాయని ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్ తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టింది.

హార్వర్డ్ వర్సిటీ ఏం చెబుతోంది...

హార్వర్డ్ వర్సిటీ ఏం చెబుతోంది...

శాటిలైట్ చిత్రాలు,సెర్చ్ ఇంజిన్ డేటా ఆధారంగా చైనాలో అగస్టులోనే కరోనా వైరస్ పుట్టినట్టు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన బయటపెట్టింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా వుహాన్‌లోని ఆసుపత్రిలో పేషెంట్ల రాకపోకలకు సంబంధించిన ట్రాఫిక్‌‌ను పరిశోధకులు విశ్లేషించారు. అలాగే వుహాన్ నుంచి కరోనా అనుమానిత లక్షణాలకు సంబంధించి సెర్చ్ ఇంజిన్‌లో రికార్డయిన డేటాను కూడా పరిశీలించారు. అందులో చాలామంది 'దగ్గు','డయేరియా' వంటి లక్షణాల గురించి సెర్చ్ ఇంజిన్‌లో వెతికారు. దీన్నిబట్టి చైనాలో అగస్టులోనే కరోనా వ్యాప్తి మొదలైందని వర్సిటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

అయితే కచ్చితంగా అదేనని చెప్పలేమంటూ..

అయితే కచ్చితంగా అదేనని చెప్పలేమంటూ..

అయితే ఆసుపత్రులకు పేషెంట్ల ట్రాఫిక్‌ పెరగడాన్ని డైరెక్ట్‌గా కరోనాతో ముడిపెట్టి చూడలేమని కూడా హార్వర్డ్ పరిశోధకులు పేర్కొనడం గమనార్హం. అయితే వుహాన్‌లోని సీ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టుకొచ్చిందని బయటపెట్టడం కంటే ముందు నుంచే అక్కడ వైరస్ మూలాలు ఉన్నాయని చెప్పేందుకు తమ పరిశోధన తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే సెర్చ్ ఇంజిన్ డేటాలో ఇదివరకు సాధారణ ఫ్లూ వంటివి వ్యాప్తి చెందినప్పుడు ఇంతలా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన దాఖలా లేదన్నారు. ఎక్కువమంది డయేరియా గురించి సెర్చ్ చేశారని తెలిపారు.

కొట్టిపారేసిన చైనా..

కొట్టిపారేసిన చైనా..

మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనను చైనా కొట్టిపారేసింది. ఈ పరిశోధన అత్యంత హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ఆసుపత్రికి వచ్చే ట్రాఫిక్‌ను విశ్లేషించి వైరస్ గురించి చెప్పడం అర్థం లేని విషయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ మీడియా ముఖంగా ఒక ప్రకటన చేశారు.

భారత్‌లోనూ గతేడాది నుంచే..!!

భారత్‌లోనూ గతేడాది నుంచే..!!


ఇటీవల ఓ ప్రముఖ పరిశోధనా సంస్థ భారత్‌లో గతేడాది నవంబర్,డిసెంబర్‌లోనే కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందినట్టు సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. మోస్ట్‌ రిసెంట్‌ కామన్‌ అన్సెస్టర్ అనే శాస్త్రీయ పద్దతి ద్వారా ఈ పరిశోధన చేపట్టినట్టు తెలిపింది. నవంబర్ 26,డిసెంబర్ 25 మధ్యలో వైరస్ భారత్‌లో వ్యాప్తి చెందినట్టు అంచనా వేసిన ఆ సంస్థ.. ఈ రెండింటి సగటు డిసెంబర్‌ 11ని ప్రామాణికంగా తీసుకుంది. ఆ రోజు నుంచి దేశంలో వైరస్ వ్యాప్తి చెందినట్టు అంచాన వేసింది. ఇతర దేశాల్లోనూ గతేడాది నుంచే వైరస్ వ్యాప్తి జరిగినట్టు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న వైరస్ లెక్కల కంటే అసలు లెక్కలు మరిన్ని రెట్లు ఎక్కువ ఉండే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని బట్టి చూస్తే.. వైరస్ విషయంలో చైనా చెబుతున్న విషయాలపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.

English summary
The coronavirus might have been spreading in China as early as August last year, according to Harvard Medical School research based on satellite images of hospital travel patterns and search engine data, but China dismissed the report as "ridiculous".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X