వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#MeTooకి పెద్ద విజయం : హాలీవుడ్ బడా నిర్మాత వెయిన్‌స్టీన్‌ను దోషిగా తేల్చిన కోర్టు..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌‌ను లైంగిక వేధింపుల కేసులో న్యూయార్క్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఒకప్పుడు హాలీవుడ్‌లోని అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన వెయిన్‌స్టీన్ (67), 2006లో మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. అలాగే 2013 లో ఔత్సాహిక నటి జెస్సికా మన్‌పై కూడా అత్యాచారం చేసినట్టు తేల్చింది. అతనిపై ఉన్న మొత్తం ఐదు అభియోగాల్లో రెండింటిలో దోషిగా తేలింది. ఈ కేసుల్లో అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వెయిన్‌స్టీన్ లాంటి బడా ప్రొడ్యూసర్‌కి శిక్ష పడటాన్ని మీటూ సాధించిన విజయంగా భావిస్తున్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | #MeToo | Namaste Trump | Anti CAA Row | Oneindia Telugu
మార్చి 11వరకు రిమాండ్‌లోనే..

మార్చి 11వరకు రిమాండ్‌లోనే..

తన అపార్ట్‌మెంట్‌లోనే ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేపై వెయిన్‌స్టీన్ లైంగిక దాడి చేశాడని కోర్టు తేల్చింది. అలాగే 2013 లో జెస్సికా మన్ అనే మహిళపై థర్డ్-డిగ్రీ అత్యాచారం చేసినందుకు.. జీవిత ఖైదుకు దారితీసే అత్యంత తీవ్రమైన చార్జ్‌ని అతనిపై మోపింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అతన్ని జైలుకు తరలించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. మార్చి 11న శిక్షను ఖరారు చేసేంతవరకు అతన్ని రిమాండులోనే ఉంచాల్సిందిగా ఆదేశించింది. కోర్టులో విచారణ సందర్భంగా వెయిన్‌స్టీన్ చాలా ఆందోళనగా కనిపించాడు. వాకర్ సాయంతో అతను కోర్టు హౌజ్‌లోకి వచ్చాడు. కొన్నిసార్లు తన తలను అటార్నీ డొనా రొటున్నోపై వాల్చి నిట్టూర్చాడు. మొత్తం మీద ఐదు రోజుల వాదనల తర్వాత 12 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం సోమవారం తుదితీర్పు వెలువరించింది.

80 మంది మహిళల ఆరోపణలు

80 మంది మహిళల ఆరోపణలు

వెయిన్‌స్టీన్‌పై మొత్తం 80 నటీమణులు,మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇందులో ప్రముఖ నటీమణులు ఏంజెలినా జోలీ, గ్వైనెత్‌ పాల్ట్రో,మెరిల్‌ స్ట్రీప్‌, జెన్నిఫర్‌ లారెన్స్‌, కేట్‌ విన్‌స్లెట్‌ వంటి నటీమణులుఉన్నారు. అయితే వెయిన్‌స్టీన్ మాత్రం పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని.. తానెవరిపై అత్యాచారానికి పాల్పడలేదని పలుమార్లు కోర్టుకు వెల్లడించాడు.విచారణ సమయంలో ప్రాసిక్యూటర్లు వెయిన్‌స్టీన్‌ను సీరియల్ ప్రెడేటర్(వరుస మోసాలు చేసేవాడు)గా అభివర్ణించారు.హాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. చాలామంది మహిళలను హోటల్ గదులకు లేదా ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు చెప్పారు.

విరుచుకుపడ్డ అటార్నీ

విరుచుకుపడ్డ అటార్నీ

కోర్టులో వాదనలు ప్రారంభమైన సమయంలో మాన్‌హట్టాన్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ మేఘన్ వెయిన్‌స్టీన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అక్కడ కూర్చున్న వ్యక్తి హాలీవుడ్‌లో టైటాన్ మాత్రమే కాదు.. అతనో రేపిస్ట్ అని మండిపడ్డారు. డిఫెన్స్ టేబుల్ వద్ద కూర్చున్న, వెయిన్‌స్టీన్ తరచూ ఆందోళనగా కనిపించాడు. తన తరుపు న్యాయవాదులను నిందితులను ప్రశ్నిస్తున్నప్పుడు మాత్రం కొన్నిసార్లు వారివైపు సీరియస్‌గా చూశాడు. అనేక వారాల పాటు సాగిన ఈ కేసులో ప్రాసిక్యూషన్ పలువురు నిందితుల నుండి గ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించింది. ఎట్టకేలకు నేటి విచారణలో అతన్ని దోషిగా తేల్చింది.

అప్పట్లో ఐశ్వర్యపై కన్ను..

అప్పట్లో ఐశ్వర్యపై కన్ను..

అప్పట్లో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌పై కూడా వెయిన్‌స్టీన్‌పై కన్ను పడిందని.. ఆమె మాజీ అంతర్జాతీయ టాలెంట్ మేనేజర్ గతేడాది అక్టోబర్‌లో వెల్లడించారు. ఐశ్వర్యను ఓసారి వెయిన్‌స్టీన్ ఒంటరిగా ఆహ్వానించాడని.. కానీ తాను సమయస్ఫూర్తితో దాన్ని బ్రేక్ చేశానని చెప్పారు. ఐశ్వర్యను ఒంటరిగా వదిలేందుకు ఎంత కావాలని కూడా అతను తనను ప్రలోభ పెట్టినట్టు అప్పట్లో ఆమె వెల్లడించారు. ఆ తర్వాత కూడా తనను వెయిన్‌స్టీన్‌ బెదిరించాడని, అయినా తన క్లయింట్‌ ఐష్‌ మీద అతని నీడ కూడా పడనీయలేదని ఆమె చెప్పుకొచ్చారు.

English summary
Former Hollywood producer Harvey Weinstein was convicted of sexual assault by a New York jury on Monday, a victory for the MeToo movement that inspired women to go public with misconduct allegations against powerful men.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X