వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమలా హ్యారిస్‌ కంటే నా వెంటే భారతీయులు, ఆమె బిడెన్‌ కన్నా దారుణం- ట్రంప్ కామెంట్స్...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా భారతీయ-జమైకా మూలాలున్న డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్ లక్ష్యంగా ట్రంప్ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు ముఖ్యంగా అధ్యక్ష రేసులో పోటీలో ఉన్న జో బిడెన్‌ కంటే కమలా హ్యారిస్‌పైనే ఎక్కువగా ట్రంప్‌ దృష్టిపెట్టినట్లు ఆయన తాజా విమర్శలను బట్టి అర్దమవుతోంది. ఇప్పటికే కమల స్ధానికతపై పదేపదే విమర్శలకు దిగడం, మేథావులు, ప్రొఫెసర్లతో వ్యాఖ్యలు చేయించడం చేస్తున్న ట్రంప్‌.. ఈ ఎన్నికల్లో ఆమెను సీరియస్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.

వేడెక్కిన అమెరికా ఎన్నికల పోరు..

వేడెక్కిన అమెరికా ఎన్నికల పోరు..


ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్ధులు హోరాహోరీ తలపడుతున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ల తరఫున ట్రంప్, డెమెక్రాట్ల తరఫున జో బిడెన్ అధ్యక్ష అభ్యర్ధులుగా రేసులో ఉన్నారు. ఉపాధ్యక్ష రేసులో మైక్‌ పెన్స్‌తో ఇండో అమెరికన్ కమలా హ్యారిస్ తలపడుతున్నారు. పేరుకు రిపబ్లికన్‌ వర్సెస్‌ డెమోక్రాట్లుగా కనిపిస్తున్నా అంతర్గతంగా ట్రంప్‌ వర్సెస్‌ కమలా హ్యారిస్‌గానే ఈ పోరు మారిపోయినట్లు తెలుస్తోంది. నిత్యం కమలను టార్గెట్‌ చేస్తూ ట్రంప్‌ చేస్తున్న విమర్శలే అందుకు కారణం. అధ్యక్ష అభ్యర్ధిగా ఉన్న జో బిడెన్‌ కంటే కమలపైనే ట్రంప్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు దీంతో అర్ధమవుతోంది.

 ట్రంప్‌ వర్సెస్‌ కమల..

ట్రంప్‌ వర్సెస్‌ కమల..

తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న పోలీసులు కాల్పులు, అనంతరం నల్ల జాతీయుల ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీటి ప్రభావం తలచుకుని ట్రంప్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ గెలుపుపై ధీమాగా కనిపించిన ట్రంప్‌.. నల్ల జాతీయురాలైన కమలా హ్యారిస్‌ను రంగంలోకి దింపే సరికి ఆత్మరక్షణలో పడినట్లు ఆయన వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోంది. ముఖ్యంగా కమల సామర్ధ్యం కంటే ఆమె స్ధానికతను పదేపదే ప్రశ్నిస్తూ సాగుతున్న ట్రంప్ ప్రచారం చూస్తుంటే ఈ పోరు ట్రంప్‌ వర్సెస్‌ కమలా హ్యారిస్‌గా మారిపోయినట్లు కనిపిస్తోంది.

కమల కంటే నాకే భారతీయుల మద్దతు..

కమల కంటే నాకే భారతీయుల మద్దతు..

తాజాగా భారతీయుల మద్దతుపై కమలా హ్యారిస్‌ను ఉద్దేశించిన ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. భారతీయుల మద్దతు కమలకే లభిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ట్రంప్... ఆమె కంటే తన వెనుకే ఎక్కువ మంది భారతీయులున్నట్లు గుర్తుచేశారు. గతంలో నమస్తే ట్రంప్, హౌడీమోడీ వంటి కార్యక్రమాలతో భారతీయులను ఆకట్టుకున్న ట్రంప్ ఈసారి ఎన్నికల్లో వారి మద్దతు తనకే లభిస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ కమల రాకతో పరిస్ధితుల్లో మార్పు వస్తోందన్న ప్రచారం మొదలైంది. దీన్ని కౌంటర్‌ చేసేందుకు కమల కంటే తనకే వారి మద్దతు లభిస్తోందన్న వాదనను ట్రంప్ మొదలుపెట్టారని తెలుస్తోంది.

Recommended Video

Israel & UAE Strike Historic Deal To Normalise Relations | Oneindia Telugu
బిడెన్‌ అసమర్ధుడు, కమల ఆయన కన్నా దారుణం..

బిడెన్‌ అసమర్ధుడు, కమల ఆయన కన్నా దారుణం..

తనకు పోటీగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన డెమెక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌ను కూడా ట్రంప్‌ వదిలిపెట్టలేదు. అమెరికాను రక్షించే సత్తా ఆయనకు లేదన్నారు. అలాగే కమలా హ్యారిస్‌ ఆయన కన్నా దారుణమని ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో వీరిద్దరూ కొంతకాలం పోలీసు చెరలో ఉన్నారని, లెఫ్ట్‌ వింగ్ పోలీసులపై జరిపిన దాడుల్లోనూ వీరి పాత్ర ఉందన్నారు. అమెరికన్ల గౌరవాన్ని వీరిద్దరూ కాపాడలేరని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో తాను మరోసారి ఎన్నిక కావడం ఖాయమని డొనాల్డ్‌ ట్రంప్ జోస్యం చెప్పారు.

English summary
us president donald trump has once again comes up with sharp criticism on indo-jamaican based democratic vice presidential candiate kamala harris and says that he has more indians than her. trump also said that she has a step worse than presidential candidate joe biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X