• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కారులోనే శృంగారం: లోయలో పడి జంట మృతి

|

స్టాక్‌హోమ్‌: శృంగారంలో పడి తమను తాము మర్చిపోయిన ఓ జంట తీరిగిరానిక లోకాలకు చేరుకుంది. కారులో విభిన్నంగా శృంగార యాత్ర సాగిద్దామనుకున్న ఓ స్వీడన్‌ జంట అనూహ్య రీతిలో లోయలోపడి ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. స్టాక్‌హోమ్‌లో స్టీప్‌హిల్‌‌పైకి కారులో వెళ్లిన ఆ ప్రేమ జంట.. ఆ కారులోనే శృంగారంలో పాల్గొన్నారు. వెనుక సీట్లో వారు సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్న సమయంలో కారు ముందుకు కదిలి కొండ మీద నుంచి దొర్లుకుంటూ లోయలో పడిపోయింది.

Having sex in a car? Don’t forget the handbrake

ఈ ఘటనలో ఆ కారు నుజ్జునుజ్జైపోయింది. దీంతో ప్రేమ జంట అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని చేరుకుని, పరిశీలించారు.

ఇకపై కారులో శృంగారం చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా హ్యాండ్‌ బ్రేక్‌ వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే ఇలాంటి ప్రమాదాలు తప్పకపోవచ్చని హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు.

English summary
Couples bent on getting cozy in their car mustn’t forget to put the handbrake on, Swedish police warned Tuesday after one passionate pair’s van crashed after rolling down a hill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X