వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ నిర్ణయంతో భూగోళం నాశనమే: స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యారిస్ పర్యావరణ ఒడంబడికనుంచి వైదలగాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భూగోళం తీవ్ర ప్రమాదంలో పడనుందని, అంతేగాక, శుక్రగ్రహంలాగా అత్యంత వేడి కలిగిన గ్రహంగా మారిపోయే ప్రమాదం ఉందని హాకింగ్ హెచ్చరించారు.

ట్రంప్ నిర్ణయంతో..

ట్రంప్ నిర్ణయంతో..

అనేక సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం కర్బన ఉద్గారాలను అదుపు చేయడంద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్యారిస్‌లో ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై 200కు పైగా దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయి. అయితే ప్యారిస్ ఒప్పందంనుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయం కారణంగా వాతావరణ మార్పు తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేనిదిగా చేస్తుందని బిబిసికిచ్చిన ఓ ఇంటర్వ్యూలో హాకింగ్ అన్నారు.

ప్రమాదటపుంచుల్లో భూగోళం

ప్రమాదటపుంచుల్లో భూగోళం

భూతాపం పూర్వస్థితికి తీసుకురాలేని పరిస్థితికి అత్యంత చేరువలో మనం ఉన్నామని హాకింగ్ అన్నారు. ట్రంప్ చర్య భూగోళాన్ని ఆ ప్రమాదం అంచులకు తీసుకెళ్తుందని చెప్పారు. 250 డిగ్రీల సెల్సియస్ వేడి, గంధక ఆమ్ల వర్షాలు ఉండే శుక్రగ్రహంలాగా మారిపోయేలా చేస్తుందని 75ఏళ్ల బ్రిటీష్ శాస్తవ్రేత్త హాకింగ్ హెచ్చరించారు.

ట్రంప్ వల్ల మన తరాలకు భారీ నష్టం

ట్రంప్ వల్ల మన తరాలకు భారీ నష్టం

మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ముప్పుల్లో పర్యావరణ మార్పు ఒకటని, అయితే ఇప్పుడే స్పందించడంద్వారా దాన్ని నివారించవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘వాతావరణ మార్పులకు సాక్ష్యాధారాలను కాదనడంద్వారా, ప్యారిస్ ఒప్పందంనుంచి వైదొలగడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ అందమైన ఈ భూగోళానికి, మనకు, మన పిల్లలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు' అని హాకింగ్ అన్నారు.

రోజులు దగ్గరపడుతున్నాయి..

రోజులు దగ్గరపడుతున్నాయి..

మానవాళి పర్యావరణ పరంగా ఎదురయ్యే సమస్యలను, ఘర్షణలను ఎప్పటికీ పరిష్కరించుకోలేదా? అని ప్రశ్నించగా.. భూమిపై మనిషి మనుగడకు రోజులు దగ్గర పడుతున్నాయని తాను భావిస్తున్నట్లు స్టీఫెన్ హాకింగ్ చెప్పారు.

ఘోరమైన పరిస్థితి తప్పదు..

ఘోరమైన పరిస్థితి తప్పదు..

పరిణామక్రమం మనిషిలోకి దురాశను, దూకుడును చొప్పించాయని, ఘర్షణలు తగ్గే సూచనలు ఏమీ కనిపించడం లేదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. జన హనన ఆయుధాల అభివృద్ధిలాంటి వాటి వల్ల ఆ ఘోరమైన పరిస్థితి తప్పదనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోదసిలో స్వతంత్ర కాలనీల ఏర్పాటుద్వారా మాత్రమే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని తాను అనుకుంటున్నట్లు హాకింగ్ చెప్పారు.

English summary
Stephen Hawking says that US President Donald Trump's decision to pull out of the Paris climate agreement could lead to irreversible climate change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X