వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యాధిగ్రస్తులు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే: హాకింగ్

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న జంతుపులు, పక్షులను చూస్తే మనం తట్టుకోలేమని, అలాంటప్పుడు మనిషి ఎందుకు బాధపడాలని హాకింగ్ అంటున్నారు.
స్టీఫెన్ హాకింగ్ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆత్మహత్యలపై స్పందించారు. తన అభిప్రాయం మేరకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జీవితాన్ని ముగించాలనుకుంటే ఆ హక్కు వారికి ఉందని, అందుకు వారికి సహకరించే వారిని విచారణ పేరుతో వేధించవద్దని చెప్పారు.
కాగా, హాకింగ్‌కు 21 ఏళ్ల వయస్సున్నప్పుడు నాడీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన కేవలం మూడేళ్లు మాత్రమే జీవించే అవకాశమున్నట్లు చెప్పారు.