వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని ప్రజలు భానుడి దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుండి బయటకు రాలేక అల్లాడి పోతున్నారు. పిల్లలు, వృద్దులు మృత్యువాత పడుతున్నారు. వేడి గాలులతో పాకిస్థాన్ ప్రజలు విలవిలలాడుతున్నారు.

గత శుక్రవారం నుండి పాకిస్థాన్ లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం నుండి మంగళవారం వరకు 700 మంది వడ దెబ్బకు బలి అయ్యారు. పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఎక్కువ మంది మరణించారని అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

Heatwave kills 700 people in Pakistan

దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే భాద్యతను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అప్పగించారు. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

భానుడి దెబ్బకు ఇప్పటికే విధ్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింధు ప్రావిన్స్ ప్రాంతాలలో ఇప్పటి వరకు 27,200 మంది బడ దెబ్బకు ఆసుపత్రిపాలైనారు. వడ దెబ్బ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

English summary
Nearly 700 people have been killed in Karachi due to Pakistan's worst heatwave in decades as the government on Tuesday shut down all educational institutions and its offices and roped in the army to deal with the crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X