వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేవలం 20 నిమిషాల్లోనే 3 నెలల వర్షం... భయంకరమైన వాన...

|
Google Oneindia TeluguNews

స్పెయిన్‌ను మంగళవారం(అగస్టు 11) భారీ వర్షాలు ముంచెత్తాయి. సెవిల్లెలో కేవలం 20 నిమిషాల్లోనే మూడు నెలల వర్షపాతం నమోదైంది. దీంతో సెవిల్లె పరిధిలోని చాలా మున్సిపాలిటీల్లో వీధులు వరదతో పోటెత్తాయి. కొన్నిచోట్ల వడగళ్ల వర్షం పడింది. ఒకచోట ఇల్లు సైతం వరద నీటిలో కుప్పకూలగా... చాలా ప్రాంతాల్లో కార్లు వరద నీళ్లలో కొట్టుకుపోయాయి.

స్పెయిన్‌కి చెందిన వాతావరణ శాఖ సోమవారమే (అగస్టు 10) సెవిల్లె ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షపాతం నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సహాయక బృందాలను అధికారులు పంపించారు. హెరెరా,కర్దోబా మున్సిపాలిటీలతో పాటు రాజధాని మాడ్రిడ్‌లోని కొన్ని ప్రాంతాలనూ భారీ వర్షం ముంచెత్తింది. అయితే దీని కారణంగా తలెత్తిన ప్రాణ,ఆస్తి నష్టంపై ఇంతవరకూ ఎటువంటి స్పష్టత రాలేదు. గత ఏడాది వానాకాలంలోనూ స్పెయిన్‌లో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ప్రస్తుతం స్పెయిన్‌లో వరదలకు సంబంధించి పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Heavy rainfall and hail storms cause flash flooding in spain

Recommended Video

COVID-19: India Close To UK in Corona Cases To Reach The Top 4

ఇటీవల భారత్‌లోనూ మహారాష్ట్ర,కేరళ,అసోం రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా వానా కాలం వచ్చిందంటే ఈ రాష్ట్రాలకు వరద ముప్పు తప్పట్లేదు. లక్షలాది మంది ప్రజల జీవితాలపై దీని ఎఫెక్ట్ పడుతోంది. ఇటీవల కేరళలోని ఇడుక్కి రాజమలై ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరింది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

English summary
One purported video shows a house collapsing due to the sudden surge of water in a matter of seconds. Thereafter, the rubble combined with the high-speeding water washes away a car which then smashes into other cars as it floats through the streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X