వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియాలో భారీ వర్షాలు..24 మంది మృతి

|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జకార్తాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగి పడటంతో 24 మంది మృతి చెందగా చాలామంది గల్లంతయ్యారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక శిబిరాల్లో ఉంచింది ప్రభుత్వం. భారీ వర్షాలకు ఇళ్ల నీట మునిగాయి. పలు ఇళ్లులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు కార్లు ఇతర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొంత మంది ప్రజలు రబ్బర్ బోట్ల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు.

జకార్తా నగరాన్ని ముంచెత్తిన వానలు

జకార్తా నగరాన్ని ముంచెత్తిన వానలు

గ్రేటర్ జకార్తా ప్రాంతంలో 21 మంది మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. లెబాక్ ప్రాంతంలో మరో ఇద్దరు మృతి చెందారని ఇండోనేషియా మంత్రి జులియారీ పీటర్ బతుబరా తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని మంత్రి తెలిపారు. లెబాక్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు జాడ కనిపించడం లేదని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వారి జాడ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే లెబాక్ ప్రాంతంలో మొత్తంగా 8 మంది ఆచూకీ గల్లంతైందని పోలీసులు చెప్పారు. ఇక కొండచరియలు విరిగి పడటంతో 8 ఏళ్ల బాలుడు, 82 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు.

అంధకారంలో జకార్తా నగరం

అంధకారంలో జకార్తా నగరం

వరదల ధాటికి కొందరు నీట మునగగా అందులో ఒకరు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు సమాచారం. భారీ వర్షాలతో జకార్తా మునిగిపోయిందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముందస్తు హెచ్చరికలు చేయలేదని చెప్పారు. భారీ వర్షాలకు నీరు క్రమంగా నివాస ప్రాంతాల్లోకి చేరి ఆపై వేగం పుంజుకుందని చెప్పారు. వరద క్రమంగా పెరగడంతో తామంతా నీటిలోనే చిక్కుకుపోయినట్లు బాధితులు తెలిపారు. ఇదిలా ఉంటే చాలా ప్రాంతాలు విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఉండిపోయాయి. విద్యుత్ సరఫరా ఉంటే షాక్‌తో ప్రజలు మృతి చెందుతున్నారని అందుకే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.

విమానాశ్రయం రన్‌వేపైకి చేరిన వరద నీరు

విమానాశ్రయం రన్‌వేపైకి చేరిన వరద నీరు


జకార్తాలో రైల్వే స్టేషన్లను, విమానాశ్రయాలను మూసివేసినట్లు తెలిపారు అధికారులు. హలీమ్ పర్దానకుసుమ విమానాశ్రయం రన్‌వేపైకి నీరు వచ్చి చేరడంతో విమానసర్వీసులను రద్దు చేసింది ప్రభుత్వం. కొన్ని విమానాల దారి మళ్లించింది. 2013 తర్వాత ఇంతటి భారీ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది. ఇండోనేషియాలో నవంబర్‌లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 31వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

English summary
Indonesia's disaster agency warned Thursday of more deaths after torrential rains pounded the Jakarta region, triggering floods and landslides that killed 24 people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X