వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పామ్ మెయిల్ తెచ్చిన అదృష్టం: 1.50 కోట్ల బహుమతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: ఓ జంక్ మెయిల్ రూ. 1.50 కోట్ల బహుమతిని తీసుకొచ్చింది. ఈ వార్త చదివిన తర్వాత జంక్, స్పామ్ మెయిల్స్‌ను కళ్లు మూసుకుని డిలీట్ చేసే వారు ఒక్కసారి ఆలోచిస్తారేమో. సాధారణంగా మనలో చాలా మంది స్పామ్ మెయిల్స్‌ను అమాంతం డిలీట్ చేస్తుంటాం.

అయితే వాటిల్లో కూడా విలువైన సమాచారం ఉంటుంది. స్పామ్, జంక్ మెయిల్స్‌ను డిలీట్ చేసే ముందు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆస్ట్రేలియాకు చెందిన రచయిత్రి హెలెన్ గార్నర్ సలహా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని యేల్ యూనివర్సిటీ తొమ్మిది మంది రచయితలకు సాహిత్య పురస్కారాలను 'విండమ్ క్యాంప్‌బెల్' పేరిట ప్రకటించింది.

యేల్ వర్సిటీ ప్రకటించిన తొమ్మిది మందిలో గార్నర్ ఒకరు. అయితే, గార్నర్ ఫోన్ నంబర్ యూనివర్శిటీ అధికారుల వద్ద లేకపోవడంతో, అవార్డు విషయాన్ని వివరిస్తూ, తమను సంప్రదించాలని ఆమెకు ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపించారు.

Helen Garner learns of $207,000 literary prize win after checking junk email

అయితే యేల్ వర్సిటీ పంపించిన ఈమెయిల్ గార్నర్ మెయిల్ బాక్సులోని స్పామ్‌కు వెళ్లింది. గార్నర్‌కు ఓ అలవాటు ఉంది. స్పామ్‌లో ఉన్న మెయిల్స్‌ను చూడకుండా ఆమె డిలీట్ చేయదు. ఈ క్రమంలో యేల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మెయిల్‌ను చూసి ఆమె ఆశ్చర్యపోయారు.

అనంతరం ఆమె వివరాలను వర్సిటీ అధికారులకు పంపారు. అవార్డులో భాగంగా 1.5 లక్షల డాలర్లను (సుమారు కోటిన్నర రూపాయలు) గార్నర్ అందుకోనున్నారు. కాగా ప్రముఖ దివంగత రచయిత డోనాల్డ్ విండమ్ పేరిట ఈ అవార్డును మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు.

ఫిక్షన్, నాన్ ఫిక్షన్ లేదా డ్రామా లాంటి విభాగాలకు సంబంధించి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఇంగ్లీషులో రాసే రచనలకు మాత్రమే ఈ అవార్డు ఇస్తుండటం విశేషం. ఈ ఏడాది ఈ పరస్కారాన్ని పొందిన తొమ్మిది మందిలో అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వారు ఉన్నారు.

English summary
Australian writer Helen Garner first learned she was the recipient of a US$150,000 (A$207,633) literary prize after reading an email in her junk folder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X