వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదిపై చక్కర్లు కొడుతూ.. అమాంతం కుప్పకూలిన హెలికాఫ్టర్... (లైవ్ వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలోకి ఓ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక పైలట్‌కు మరియు డాక్‌లో పనిచేసే మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. మాన్‌హటన్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ చాపర్ నియంత్రణ కోల్పోయింది. దీంతో హడ్సన్ నదిపైనే పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు.

హడ్సన్‌ నదిపై పలుమార్లు చక్కర్లు కొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పైలట్ చాపర్‌పై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. హడ్సన్ నదిలో కుప్పకూలగానే వెంటనే అక్కడి ప్రజలు స్పందించారు. అందులో చిక్కుకుపోయిన పైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే ప్రజలు స్పందించి పైలట్‌ ప్రాణాలు కాపాడినందుకు కతృజ్ఞతలు తెలిపారు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో. కొంత సమయం పాటు ఆ ఏరియాను నిర్మానుష్యంగా వదలాలని ప్రజలు ఇందుకు సహకరించాలని ఆయన ట్విటర్ ద్వారా కోరారు.

Helicopter crashes into Hudson river, video goes viral

ఇదిలా ఉంటే ప్రమాదంలో డాక్‌యార్డులో పనిచేసే మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఆ నదిలో ఒక పడవపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదాన్ని చూసిన వెంటనే నదిలోకి దూకి పైలట్‌ను కాపాడాడు. నదిలో ప్రమాదాలు చాలా జరిగాయని...

ఏ ప్రమాదం జరిగినా తమ సిబ్బంది వెంటనే స్పందిస్తారని షిప్ నడిపే పైలట్ చెప్పారు. 2009లో అమెరికా ఎయిర్‌వేస్ పైలట్ చెస్లీ ఎయిర్‌ బస్‌ను నదిపై ల్యాండ్ చేశారు. ఆసమయంలో విమానంలో దాదాపు 155 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ సమయంలో బాతు గుంపును ఢీకొట్టగానే విమానం పట్టు తప్పింది. దీంతో పైలట్ హడ్సన్ నదిపై ల్యాండ్ చేశాడు.

English summary
A helicopter crashed into the Hudson River in New York City on Wednesday shortly after taking off from Manhattan, causing minor injuries to the pilot and a dockworker, police and fire officials said.Dramatic video footage of the incident shot by witnesses and posted on social media showed the helicopter spinning seemingly out of control over the Hudson near 30th Street, before plummeting into the water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X