• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసలేంటీ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’? ఏం చేసింది?: డేటా చౌర్యం, ఎఫ్‌బీ సారీ

|

వాషింగ్టన్/న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది 'కేంబ్రిడ్జ్ అనలిటికా'(సీఏ). అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన ఈ సంస్థ.. కోట్లాది మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాక, ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ తన ఖాతాదారులకు క్షమాపణలు చెప్పుకున్నారు.

కేంబ్రిడ్జ్ అనలిటికా.. జుకర్‌బర్గ్ సారీ

కేంబ్రిడ్జ్ అనలిటికా.. జుకర్‌బర్గ్ సారీ

ఇది ఇలావుంటే, భారత రాజకీయాల్లో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం పెద్ద దుమారాన్నే సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో ఉపయోగించుకున్నారని కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని, ఎన్నికల్లో ఎలాంటి జోక్యం ఉండదని భారత ప్రభుత్వానికి జుకర్ బర్గ్ క్షమాపణలు కోరారు.

అసలీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏంటీ..?

అసలీ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏంటీ..?

కాగా, బ్రిటన్‌కు చెందిన డేటా అనలిటిక్స్ సంస్థే ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా. బ్రిటన్ ప్రైవేట్ బిహేవియరల్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ కంపెనీ ఎస్‌సీఎల్ గ్రూప్ 2013లో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థను ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థను ప్రారంభించడం, రిపబ్లికన్ పార్టీకి చెందిన బిలియనీర్ రాబర్ట్ మెర్సర్ ఆర్థికంగా ఈ కంపెనీకి అండగా ఉండటం గమనార్హం. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ చేస్తున్న పని ఏంటంటే.. కన్స్యుమర్ రీసెర్చ్(వినియోగదారుల అధ్యయనం)ను అందించడం. రాజకీయ, కార్పొరేట్ క్లయింట్లకు అడ్వైర్టజింగ్, ఇతర డేటా సంబంధిత సర్వీసుల్లోని వినియోగదారులపై అధ్యయనం చేసి నివేదికలు ఇస్తూ ఉంటుంది. న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, బ్రెజిల్, మలేషియాల్లో దీనికి ఆఫీసులున్నాయి.

ఇది ఫేస్‌బుక్‌ను డిలీట్ చేయాల్సిన టైమ్: వాట్సప్ కో-ఫౌండర్ బ్రియాన్ సంచలనం

ఎఫ్‌బీ వ్యక్తిగత సమాచారం చౌర్యం

ఎఫ్‌బీ వ్యక్తిగత సమాచారం చౌర్యం

కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ సంస్థ ట్రంప్‌ కోసం పనిచేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 5కోట్ల మంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌ నుంచి సేకరించి ఎన్నికలను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. 2014 నుంచే కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఈ డేటాను సేకరించిందని సమాచారం. ఇందుకోసం బ్రిటన్‌ పరిశోధకుడు అలెగ్జాండర్‌ కోగన్‌ ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను 2.7లక్షల మందికి పైగా ఫేస్‌బుక్‌ క్రెడెన్షియల్స్‌తో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇలా ఆ కంపెనీకి ఆయా యూజర్ల, వారి స్నేహితుల వ్యక్తిగత సమాచారం చిక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే కేంబ్రిడ్జ్‌ మాత్రం మరోలా చెబుతోంది. కోగన్‌ ఫేస్‌బుక్‌ నిబంధనలను ఉల్లంఘించారని తమకు మొదట్లో తెలియదని.. తెలిసిన తర్వాత ఆ డేటాను తొలగించామని చెప్పింది.

ట్రంప్ విజయం తర్వాత విస్తరణ బాట

ట్రంప్ విజయం తర్వాత విస్తరణ బాట

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం తర్వాత కేంబ్రిడ్జ్‌ అనలిటికా తమ సంస్థను మరింత విస్తరించుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే సీఈవో అలెగ్జాండర్‌ నిక్స్‌ తాము సేవలందిస్తామంటూ కొందరు క్లయింట్లను వ్యక్తిగతంగా కలిశారు. అంతేగాక.. వినియోగదారుల సైకలాజికల్‌ ప్రొఫైళ్లను కూడా తయారుచేస్తామని కేంబ్రిడ్జ్‌ అనలిటికా చెప్పుకొచ్చింది. కాగా, ట్రంప్‌ కంటే ముందు రిపబ్లికన్‌ సెనెటర్‌ టెడ్‌ క్రూజ్‌ ఎన్నికల ప్రచారానికి కూడా కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటాను అందించింది. ఈ విషయాన్ని ఇటీవల క్రూజ్‌ కూడా చెప్పారు. మరోవైపు తాము కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటాను ఉపయోగించుకోలేదని 2016లో ట్రంప్‌ డిజిటల్‌ కార్యకలాపాలు నిర్వహించిన బ్రాడ్‌ పార్‌స్కేల్‌ చెప్పడం గమనార్హం.

తప్పైంది, డేటా రక్షణకు చర్యలు, భవిష్యత్తులో చోటుచేసుకోవు: జుకర్ బర్గ్

ఎట్టకేలకు సీఈఓపై వేటు

ఎట్టకేలకు సీఈఓపై వేటు

ఇది ఇలా ఉండగా, కేంబ్రిడ్జ్‌ అనలిటికా యాజమాన్యం తన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్(సీఈఓ) అలెగ్జాండర్ నిక్స్‌ను సస్పెండ్‌ చేసింది. విదేశాలలో ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా తాము అనుచిత పద్ధతులను అనుసరించినట్లు నిక్స్‌ బ్రిటన్‌ ఛానల్‌4 ప్రసారం చేసిన వీడియో కథనంలో అధికారికంగా వెల్లడించటంతో కేంబ్రిడ్జ్‌ అనలిటికా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తన కథనంలో వివరించింది. సీఈఓను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన కేంబ్రిడ్జ్ అనలిటికా యాజమాన్యం ఇటీవల ఛానల్‌4 రహస్యంగా రికార్డ్‌ చేసిన నిక్స్‌ వ్యాఖ్యలు, ఇతర ఆరోపణలు తమ కంపెనీ మౌలిక విలువలను లేదా కార్యకలాపాలను ప్రతిబింబించబోవని స్పష్టం చేసింది. తాము మౌలిక విలువలకు, క్రమశిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను, ఈ సస్పెన్షన్‌ రుజువు చేస్తుందని తన ప్రకటనలో పేర్కొంది.

English summary
Alongside social media giant Facebook, Cambridge Analytica is at the center of an ongoing dispute over the alleged harvesting and use of personal data. Both companies deny any wrongdoing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X