• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లేడీ బాస్ లైంగిక వేధింపులు: మహిళా టెక్కీ ఫిర్యాదు

By Pratap
|

High-level woman Yahoo executive sued for sexual harassment
కాలిఫోర్నియా: యాహూ సంస్థలోని ఉన్నత స్థాయిలో ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతోందంటూ ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని యాహూ మొబైల్ విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారియా ఝాంగ్ తనను వేధించిందని నాన్ షీ అనే ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ఉన్న శాంతాక్లారా కోర్టులో ఫిర్యాదు చేసింది.

సన్నీవేల్, కాలిఫోర్నియాల్లో పలు మార్లు ఆమె తనను ఓరల్, డిజిటల్ సెక్స్ కోసం వేధించిందని నాన్ షి ఆరోపించారు. తనతో శృంగారంలో పాల్గొంటే భవిష్యత్తు బాగుంటుందనే లేడీ బాస్ చెప్పేదని ఆమె అన్నారు. ఈ వేధింపులకు తనకు భారీ మొత్తంలో నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.

అయితే, యాహూ ప్రతినిధి ఆ ఆరోపణలను ఖండించారు. మారియా ఝాంగ్ మీద చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆరోపణలకు ఆధారాలు లేవని, మారియా కంపెనీలో మంచి ఎగ్జిక్యూటివ్ అని ఆ ప్రతినిధి అన్నారు. ఈ కేసును తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు.

మారియా ఝాంగ్ స్థాపించిన సొంత మొబైల్ కంపెనీని యాహూ 2013లో టేకోవర్ చేసింది. అంతకు ముందు ఆమె మైక్రోసాఫ్ట్ జిల్లో కంపెనీలో పనిచేశారు. తనను ఉద్యోగం నుంచి కూడా తీసేశారని నాన్ షీ చెప్పింది.

English summary

 A high-level female Yahoo Inc executive has been sued in California by a woman who worked under her and is accusing her former boss of sexual harassment and wrongful termination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X