వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ ప్రొఫెషనల్స్‌కు బిగ్ రిలీఫ్: ఆ బిల్లును ఆమోదించిన అమెరికా సెనెట్: ట్రంప్ చేతుల్లో ఫైనల్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ అత్యున్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలు గల వారికి అమెరికా శుభవార్తను వినిపించింది. వారికి మరింత వెసలుబాటు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును సెనెట్ ఆమోదించింది. హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్‌కు ఆమోదముద్ర తెలిపింది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఉద్యోగాల కోసం అమెరికా వృత్తి నిపుణుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికంగా ఉంటోంది. అమెరికా సెనెట్ ఆమోదం తెలిపిన ఈ కొత్త చట్టం వల్ల భారత్‌కు చెందిన వేర్వేరు రంగాల్లోని నిపుణులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టేనని భావిస్తున్నారు.

Recommended Video

US Senate passed High-Skilled Immigrants Act Bill, huge relief to Indian IT Professionals

అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయుల్లో అయిదు లక్షల మందికి పౌరసత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కొద్దిరోజుల్లోనే.. హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ చట్టానికి సెనెట్ ఆమోదం తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పౌరసత్వాన్ని కల్పించాలంటూ అమెరికా వ్యాప్తంగా 11 మిలియన్లకు పైగా అన్ డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నాయి. వాటిల్లో అయిదు లక్షల వరకు భారతీయులు దాఖలు చేసిన దరఖాస్తులు ఉన్నాయి.

High-Skilled Immigrants Act: US Senate Passes Bill , relief to indian it professionals

ప్రతి దేశానికి ఇదివరకు కేటాయించిన గ్రీన్‌కార్డుల సంఖ్య, ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ విసాల శాతాన్ని పెంచడానికి ఈ చట్టం దోహదపడుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ-బేస్డ్ విసాల సంఖ్య ఏడుశాతం వరకు ఉంటోంది. ఇక ప్రతి సంవత్సరం 15 శాతం వరకు ఫ్యామిలీ-బేస్డ్ విసాలను జారీ చేయడానికి వీలు ఉంటుంది. ప్రస్తుతం అమెరికా సంవత్సరానికి 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తోంది.

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) డేటా ప్రకారం.. ఏడాది ఏప్రిల్ 31వ తేదీ నాటికి ఎనిమిది లక్షల మంది భారతీయులు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను చేసుకున్నారు. పాత చట్టం ప్రకారం.. అమెరికా ప్రభుత్వం దాదాపు అన్ని విసా దరఖాస్తులను ఆమోదించింది. ఈ ఏడాది దాఖలైన దరఖాస్తులను కొత్తగా తీసుకొచ్చిన హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ చట్టం కింద ఆమోదించే అవకాశం ఉంది.

సెనెట్ ఆమోదించిన ఈ బిల్లును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించాల్సి ఉంది. ఆయన ఆమోదం కోసం దీన్ని మరో రెండు రోజుల్లో అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు పంపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం అధికార మార్పిడి జరగాల్సి ఉన్నందున.. డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తన హయాంలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తారా? లేక జో బిడెన్ సారథ్యంలో ఏర్పాటుకాబోయే కొత్త ప్రభుత్వం మీదికి వదిలేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

English summary
The United States Senate passed the 'Fairness for High-Skilled Immigrants Act' or S.386 bill on Wednesday evening, proving a huge relief to thousands of Indian nationals currently stuck in Green Card limbo. The bill aims to do away with the country caps on employment-based green cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X