వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతని ఆదాయం ఏడాదికి రూ.9.2కోట్లు.. ఆఫీసులో ఫుడ్ దొంగిలించి సస్పెండ్ అయ్యాడు..

|
Google Oneindia TeluguNews

లండన్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీగ్రూప్‌లో పనిచేస్తున్న ఓ హైప్రొఫైల్ భారతీయ బ్యాంక్ అధికారిని ఆ సంస్థ సస్పెండ్ చేసింది. క్యాంటీన్ నుంచి ఫుడ్ దొంగిలిస్తున్నాడన్న కారణంతో అతన్ని సస్పెండ్ చేసింది. అతని వార్షిక వేతనం రూ.9.2కోట్లు. అంత భారీ వేతనం అందుకునే వ్యక్తి.. సిల్లీగా క్యాంటీన్‌లో ఫుడ్ దొంగతనం చేయడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఎవరతను..

ఎవరతను..

సస్పెండ్ అయిన ఆ అధికారి పేరు పరాస్ షా(31). లండన్‌లోని కెనరీ వార్ఫ్‌లో ఉన్న సిటీబ్యాంక్ యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నాడు. యూరోప్‌లో బాండ్ ట్రేడింగ్‌కు సంబంధించి అత్యున్నత పదవిలో అతను కొనసాగిస్తున్నాడు. అయితే గత నెల సంస్థ అతన్ని సస్పెండ్ చేసింది. క్యాంటీన్‌లో ఫుడ్ దొంగిలిస్తున్నాడన్ కారణంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఫుడ్ దొంగతనం ఆరోపణలు

ఫుడ్ దొంగతనం ఆరోపణలు

యూరోప్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా షాకి ఎంతో గుర్తింపు ఉంది. గతంలో హెచ్‌ఎస్‌బీసీలో పనిచేసిన షా.. 2017లో సిటీగ్రూప్‌లో చేరాడు. ట్రేడింగ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన షా.. ఇలా ఫుడ్ దొంగతనం ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురవడం హాట్ టాపిక్‌గా మారింది.

స్పందించేందుకు విముఖత..

స్పందించేందుకు విముఖత..

సిటీగ్రూప్ కంపెనీ మరికొద్దిరోజుల్లో సీనియర్ స్టాఫ్‌కు బోనస్ ఇవ్వనుంది. ఇంతలోనే షా సస్పెన్షన్‌కు గురవడం గమనార్హం. సస్పెన్షన్‌పై షాను సంప్రదించేందుకు కొన్ని మీడియా వర్గాలు ప్రయత్నించగా.. ఆయన విముఖత వ్యక్తం చేశారు. అటు సిటీగ్రూప్ కంపెనీ కూడా ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించింది.

ఇదే మొదటిది కాదు..

ఇదే మొదటిది కాదు..


చిన్న కారణాలకే పెద్ద పొజిషన్‌లో ఉన్న వ్యక్తులను తొలగించడం లండన్‌లో ఇదేమీ తొలిసారి కాదు. 2014లో బ్లాక్‌రాక్ డైరెక్టర్ జొనాథన్ పాల్ బురోస్‌ను ఆ సంస్థ తొలగించింది. లండన్‌లోని ఆఫీస్‌కు వచ్చేందుకు ప్రతీరోజూ ట్రైన్‌లో ప్రయాణించే జొనాథన్.. ట్రైన్ టికెట్ కొనకుండానే ప్రయాణిస్తున్నాడన్న కారణంతో అతన్ని సస్పెండ్ చేసింది. ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ(FCA) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. చౌకబారుగా వ్యవహరించడం వల్లే అతను సస్పెన్షన్‌కు గురైనట్టు తెలిపింది.

English summary
A high-profile Indian banker in London was suspended by Citigroup after he was accused of stealing food from the office canteen.Paras Shah, who was apparently earning a handsome seven-digit salary (in British pounds), was suspended after he stole food from the canteen at Citibank's European headquarters in Canary Wharf, London. In Indian currency, Shah took home almost Rs 9.2 crore per year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X