వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ కార్డు కోసం వారు 151 ఏళ్లు ఎదురు చూడాలి, పెండింగులో 6 లక్షలకు పైగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే వారికి గ్రీన్ కార్డ్ ఓ కల. శాశ్వతంగా అక్కడ సెటిల్ కావడానికి వీలు కల్పించే చట్టపరమైన వెసులుబాటు. కానీ ఇది లభించడం రోజు రోజుకు కష్టతరమవుతోందట. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగి ఉండి, అద్భుత ప్రతిభా సామర్థ్యాలు, నైపుణ్యం కలిగి ఉన్న భారతీయులు గ్రీన్కార్డ్ లేదా శాశ్వత పౌరసత్వం కోసం 150 సంవత్సరాల పాటు ఎదురు చూడాలట.

ఈ మేరకు కాటో ఇనిస్టిట్యూట్ విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. దాదాపు నాలుగు లక్షల మంది భారతీయుల గ్రీన్ కార్డ్ కల నెరవేరాలంటే వారు 151 సంవత్సరాలు వేచి చూస్తేనే లభిస్తుందని తెలిపింది.'

Highly Qualified Indians Might Have To Wait For 151 Years For US Green Card: Report

2018 ఏప్రిల్ 20వ తేదీ నాటికి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. గ్రీన్ కార్డు మూడు కేటగిరీల్లో ఇస్తారు. అత్యంత నైపుణ్యం కలిగిన వారిని ఈబీ1, మంచి ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వారిని ఈబీ 2, బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారిని ఈబీ 3 కేటగిరీల కింద చేర్చారు.

కాటో లెక్క ప్రకారం.. ఈబీ 1 కింద 34 వేలకు పైగా భారతీయుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భార్యా, పిల్లలను కలుపుకుంటే మరో 48వేలకు పైగా ఉంటాయి. ఇవన్నీ 85వేలకు పైగా ఉన్నాయి. వీరికి అందరికంటే వేగంగా ఆరేళ్లలో గ్రీన్ కార్డు లభించే అవకాశముంది.

ఈబీ 3 కేటగిరీ వారు 17 సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది. ఈ కేటగిరీ కింద ఉన్నారు, వీరి భార్యాపిల్లలను కలుపుకుంటే లక్షా పదిహేను వేలకు పైగా ఉన్నారు. ఈబీ2 కేటగిరీ కింద ఉన్న వారు మాత్రం గ్రీన్ కార్డు కోసం 151 సంవత్సరాలు వేచి చూడాలట. వీటి కింద దరఖాస్తు చేసుకున్న వారు రెండు లక్షలకు పైగా ఉండగా, భార్యా పిల్లలను కలుపుకుంటే నాలుగు లక్షల 33 వేలకు పైగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న చట్టాలు మార్చకుంటే లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిగా ముద్రపడతారని కూడా కాటో ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది.

English summary
Indians with advanced degrees may have to wait for over 151 years for a green card which authorises them to live and work in the US permanently, according to projections by a think-tank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X