వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయండి: కాంగ్రెస్‌కు హిల్లరీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

క్యూబా దేశంపై అమలవుతున్న వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా కాంగ్రెస్‌ను హిల్లరీ క్లింటన్ కోరారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం హిల్లరీ క్లింటన్ మియామీలో ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె తన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

డెమోక్రటిక్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ పైవ్యాఖ్యలు చేశారు. అయితే హిల్లరీ చేసిన వ్యాఖ్యలను రిపబ్లికన్ పార్టీ మాత్రం హిల్లరీ వ్యాఖ్యలను ఖండించింది. గత వారంలో ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ క్యూబాతో సంబంధాల పునరుద్ధరణ అనేది విఫలమైన గత విధానాలను గుర్తుకు తెస్తోందని అన్నారు.

అమెరికా, క్యూబా రెండు దేశాల మ‌ధ్య సిధ్దంత ప‌ర‌మైన విభేదాల‌ున్నాయి. దీంతో రెండు దేశాల మ‌ధ్య కూడా 1961 నుంచి దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నా‌యి. అయితే ఇటీవల ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. గతాన్ని పక్కనబెట్టి రెండు దేశాలు పరస్పరం కలిసి పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

 Hillary Clinton to call on Congress to lift Cuban embargo

అంతేకాదు అగ్రరాజ్యం అమెరికా రూపొందించిన ఉగ్రవాద ప్రేరేపిత దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించింది. దీంతో ఉగ్రవాద ప్రేరేపతి దేశాల జాబితాలో ఇక సిరియా, ఇరాన్, సుడాన్‌లు మాత్రమే మిగిలాయి. ఈ ఈ నిర్ణయంపై క్యూబా హర్షం వ్యక్తం చేసింది. ఇది న్యాయమైన నిర్ణయమంటూ అమెరికాకు కృతజ్ఞతలు కూడా తెలిపింది. కాగా, 54 ఏళ్లుగా మూసివేసిన ఉన్న రాయబార కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్‌, క్యూబా రాజధాని హవానాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు తిరిగి ప్రారంభించారు. వీటితో పాటు టూరిజం, వ్యవసాయం, బ్యాంకింగ్‌, వాణిజ్యరంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడానికి ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
Hillary Clinton to call on Congress to lift Cuban embargo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X