వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడిన సందిగ్ధత: చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్ధులు ఎవరనే విషయమై సందిగ్ధత వీడింది. రిపబ్లికన్ల తరుపున డొనాల్ట్ ట్రంప్ నామినేషన్ ఖరారు కావడంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా డెమొక్రాట్ల తరుపున అమెరికా మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ నామినేషన్‌ సాధించారు.

2016 ఎన్నికల్లో
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి సరిపడా మద్దతుదారుల ఓట్లను ఆమె దక్కించుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ నెట్ వర్క్ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాల్లో పేర్కొన్నాయి. దీంతో అమెరికాలో ఓ ప్రధాన పార్టీ నుంచి పోటీపడుతున్న తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ (68) రికార్డు సృష్టించారు.

ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శాండర్స్‌ను అధిగమించి అధ్యక్ష నామినేషన్ కోసం కావాల్సిన 2383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు.
ఇదే విషయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించిన మరుక్షణం ఆమె ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకుకున్నారు.

ఇంకా కొన్ని ప్రైమరీలు మిగిలి ఉండగానే ఈ వార్తలు వెలువడటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. చివరి నిమిషంలో ఆమెకు సూపర్‌డెలిగేట్ ఓట్లు లభించడంతో ఆమె విజయం సాధించినట్లు ఏజెన్సీ ప్రెస్ ప్రకటించింది.

తాను ఇంకా ప్రైమరీల్లో విజయం సాధించవలసి ఉందన్నారు. అయితే హిల్లరీకి ప్రధాన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న శాండర్స్ మాత్రం ఇంకా తన ఓటమిని అంగీకరించలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను జూలైలో జరిగే పార్టీ సదస్సు వరకూ తాను పోటీలో ఉన్నట్టేనని ఆయన అన్నారు.

"దురదృష్టవశాత్తూ మీడియా ముందుగానే విజేతలను ప్రకటించేసింది. డెమోక్రాట్ల నేషనల్ కమిటీ సూచించినట్టుగా సూపర్ డెలిగేట్ల ఓట్లను వారు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ వేసవిలో జరిగే సదస్సులో వారూ ఓటేస్తారన్న విషయాన్ని మరిచారు" అని శాండర్స్ ప్రతినిధి మైఖేల్ బ్రిగ్స్ ఓ ప్రకటనలో ఆరోపించారు.

కాగా, సూపర్ డెలిగేట్స్ ఓట్లలో 561 మంది హిల్లరీ వైపుండగా, శాండర్స్ వెనుక కేవలం 47 మంది మాత్రమే ఉన్నట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. మరోవైపు ఈ ప్రైమరీ ఎన్నికలతో అమెరికా అభ్యర్థిత్వానికి కావాల్సిన ఆధిక్యాన్ని ఆమె కచ్చితంగా సంపాదిస్తారని హిల్లరీ స్నేహితులు విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

డెమొక్రాట్ల తరుపున అమెరికా అభ్యర్థిత్వానికి 2,382 మంది ప్రతినిధుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం 2,354 మంది హిల్లరీకి మద్దతుగా నిలిచారు. అంటే మరో 28 మంది మద్దతు పలికితే ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని అసోసియేటెడ్ ప్రెస్, యూఎస్ నెట్ వర్క్ సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.

English summary
Hillary Clinton clinched the Democratic presidential nomination Monday, according to CNN's delegate and superdelegate count, and will become the first woman in the 240-year history of the United States to lead the presidential ticket of a major political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X