వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాదరణలో ముందంజలో ఉన్నా అధ్యక్ష పదవికి దూరమైన హిల్లరీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా హిల్లరీ నిరూపించుకొన్నారు. ఈ ఎన్నిలక్లో ఆమెకు ట్రంప్ కంటే అధికంగా ఓట్లు లభించాయి. ఈ ఓట్లు వచ్చినా....ఎలక్టోరల్ కాలేజ్ దన్ను కారణంగా హిల్లరీ ఓటమి పాలయ్యారు.

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెముక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీచేశారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. హిల్లరీ క్లింటన్ ఓటమి పాలైనప్పటికీ ప్రజారణ ఓట్లలో ట్రంప్ కంటే ఎక్కువ ఓట్లను ఆమె కూడబెట్టారు.హిల్లరీ క్లింటన్ కు 47.7 శాతం ఓట్లతో 5 కోట్ల 97 లక్షల55 వేల 284 ఓట్లు దక్కాయి.ట్రంప్ కు మాత్రం 47.5 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ట్రంప్ కు 5 కోట్ల95 లక్షల35 వేల 522 ఓట్లు వచ్చాయి.అయితే ప్రజాదరణ ఓట్లు ట్రంప్ కంటే ఎక్కువగా వచ్చిన ఎలక్టోరల్ కాలేజ్ వచ్చిన ఆధిక్యత కారణంగా హిల్లరీ ఓటమి పాలైంది.

డెముక్రాటిక్ పార్టీకి పట్టున్న పెన్సిల్వేనియా, విన్ కాన్సిన్, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఒహాయో రాష్ట్రాల్లో అనూహ్య విజయాలతో ట్రంప్ శ్వేత సౌధాన్ని అధిష్టించారు.ట్రంప్ కు 290 ఓట్లు రాగా, హిల్లరీకి 223 ఓట్ల వద్దే ఆగిపోయింది.గతంలో కూడ ప్రజాదరణలో అధిక శాతం ఓట్లు సాధించిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. 2000 సంవత్సరంలో డెముక్రటిక్ అభ్యర్థి ఆల్ గోర్, 19వ, శతాబ్ధంలో ఆండ్రూ జాక్సన్, శామ్యూల్ టిల్డెన్, గ్రోవర్ క్లీవ్ లాండ్ లు పాపులర్ ఓటు సాధించినా ఓటమిపాలయ్యారు.2012 లో కూడ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీ కూడ పాపులర్ ఓట్లు సాధించినా... ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో ఒబామా గట్టెక్కారు.

hillary get highest votes from popularity votes

ట్రంప్ కు అండగా నిలిచిన మహిళలు.

హిల్లరీ వైపే ఎక్కువశాతం మహిళలు నిలిచారు. ట్రంప్ పై అనేక ఆరోపణలు వచ్చాయి,.ముఖ్యంగా లైంగిక వేధింపులకు సంబందించిన ఆరోపణలను అనేక మంది చేశారు. అయినా ఈ ఆరోపణల ప్రభావం అంతగా ట్రంప్ పై చూపలేదు.12 మంది మహిళలు తమను ట్రంప్ లైంగికంగా వేధించాడని ఎన్నికల సమయంలో ఆరోపణలు గుప్పించారు. హిల్లరీకి కేవలం 54 శాతం మహిళల ఓట్లు మాత్రమే దక్కాయి.అనేక ఆరోపణలు ఎదుర్కొన్నా ట్రంప్ కు 42 శాతం ఓట్లు వచ్చాయి.శ్వేతజాతి మహిళలు 53 శాతం ట్రంప్ ను బలపర్చడం ప్రధానంగా పరిగణించాల్సి ఉంది.

అమెరికాలో నెలకొన్న పరిస్థితులు ప్రధానంగా ఈ ఎన్నికలపై ప్రభావం చూపాయి. ఈ అంశాలను ఎజెండాగా చేసుకొని ప్రచారం చేసిన ట్రంప్ కు అమెరికన్లు పట్టం కట్టారు.ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, వసల విధానాల విషయంలో ట్రంప్ చేసిన ప్రచారం అమెరికన్లను ఆకట్టుకొంది.ఈ మేరకు అమెరికన్లు ట్రంప్ కు మద్దతుగా నిలిచారు.

English summary
hillary got more than votes in popularality, but trmp has won in america prsident elections. in electoral college votes mote than hillary . no effect on trump allegation of sexual harrasment .42 percent of women voters vote trump. hillary 54 percentage of votes from women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X