వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆహార విందులో ట్రంప్ సెటైర్లు - హిల్లరీ పంచ్‌లు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న హిల్లరీ- ట్రంప్ ఎదురుపడితే మాటల తూటాలు పేలుతాయి. ఇటీవల జరిగిన మూడు బిగ్ డిబేట్ లో ఇద్దరూ తమ వాగ్దాటిని ప్రదర్శించారు.

అయితే న్యూయార్క్ లో ఓ విందులో కలుసుకున్న వీరు ప్రత్యక్షంగా విమర్శించుకోకున్నా, ఒకరి మీద ఒకరు జోకులు వేసుని అక్కడున్న అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. న్యూయార్క్ లోని ఆల్ ఫ్రెడ్ స్మిత్ పౌండేషన్ ఏటా అక్టోబర్ మూడో వారంలో విందు నిర్వహించింది.

భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన ఈ విందుకు హిల్లరీ క్లింటన్, ట్రంప్ లను ఆహ్వానించారు. ముందుగా విందుకు ట్రంప్ హాజరైనారు. తరువాత హిల్లరీ వెళ్లారు. ఆ సందర్బంలో ట్రంప్ మాట్లాడుతూ హిల్లరీని ఎవరు విందుకు పిలిచారు అని అక్కడున్న వారిని ప్రశ్నించారు.

హిల్లరీని ఈ విందుకు ఎలా పిలిచారో నాకు తెలీదు, ఒక వేళ మీరు ఈ మెయిల్ ద్వారా ఆహ్వానించలేదనుకుంటా ? అలా పిలిచుంటే, అది ఆమె చూసుంటే అది కూడా మనకు వికీలీక్స్ దార్వా మనందరికి తెలిసేదేమో అంటూ పరోక్షంగా ఈమెయిల్ ఉందాతాన్ని గుర్తు చేశారు.

 Hillary v Donald Trump at the AI Simth dinner in New York

అందుకు హిల్లరీకి మాత్రం కోపంరాలేదు. అక్కడున్న వారితో సహ ఆమెకూడా గట్టిగా నవ్వేశారు. అనంతరం హిల్లరీ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కే గుర్రమంత ఆరోగ్యంగా ట్రంప్ ఉన్నాడని పంచ్ వెయ్యడంతో విందులో నవ్వుల పంటపండింది.

న్యూయార్క్ లోని లిబర్టీ విగ్రహాన్ని కూడా ట్రంప్ వంకరగా చూస్తారని హిల్లరీ దీటుగా సమాధానం ఇచ్చారు. ఈ డిన్నర్ పూర్తయ్యాక ట్రంప్ తన విందు పూర్తి చేసినట్లు ఒప్పుకుంటారో లేదో చూసి చెప్పాలని మరోసారి చురకలంటించారు. ట్రంప్ పక్కన ఆయన ప్రచార మేనేజర్ల కంటే తానే ఎక్కువగా నిలబడి ఉంటానని హిల్లరీ పంచ్ లు వేశారు.

English summary
The annual Catholic fundraiser for needy children, hosted by the Archbishop of New York. But could Trump and Clinton – battling in the bitterest election for years rise to the occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X